Trains Cancelled: ఈ రోజు నుంచి తిరుపతి, కడపతో పాటు ఆ రైళ్లన్నీ రద్దు.. లిస్ట్ ఇదే!

నిర్వహణ కారణాలతో పలు మొత్తం 4 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. 06401, 06402, 07657, 07658 నంబర్ గల రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.

New Update
Trains Cancelled: ఈ రోజు నుంచి తిరుపతి, కడపతో పాటు ఆ రైళ్లన్నీ రద్దు.. లిస్ట్ ఇదే!

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు (Trains Cancel) చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Train No.06401: అరక్కోణం-కడప ట్రైన్ ను ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
Train No.06402: కడప-అరక్కోణం ట్రైన్ ను సైతం ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు రద్దు చేశారు.
Train No.07657: తిరుపతి-హుబ్బాళి ట్రైన్ ను కూడా ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు క్యాన్సెల్ చేశారు.
Train No.07658: హుబ్బళి-తిరుపతి ట్రైన్ కూడా రద్దైన రైళ్ల జాబితాలో ఉంది. ఈ ట్రైన్ ను ఈ నెల 23 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు రద్దు చేశారు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సర్వీస్(Vande Bharat Express) ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ హైదరాబాద్(Hyderabad) – బెంగళూరు(Bengaluru) మధ్య నడవనుంది. సెప్టెంబర్ 24న ఈ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ ట్రైన్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్(బెంగళూరు) మధ్య ఈ వందేభారత్ ట్రైన్ నడవనుంది. ఈ ట్రైన్‌ను ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇకపోతే.. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో జరిగే ఈ ప్రారంభోత్సవ కార్య్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy), రైల్వే ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: Vande Bharat Express: కాచిగూడ నుంచి మరో ‘వందేభారత్’ ట్రైన్ సర్వీస్ ప్రారంభం.. పూర్తి వివరాలివే..

ట్రైన్ టైమింగ్స్ ఇవీ..

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సోమవారం నుంచి కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి.. మహబూబ్‌నగర్‌, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి.. రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది ఈ ట్రైన్. ఇదిలాంటే.. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌తో పాటు.. ఇదే రోజున మరో 9 వందేభారత్ ట్రైన్ సర్వస్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో విజయవాడ-చెన్నై వందేభారత్‌ కూడా ఉండటం విశేషం. ఈ రైలు విజయవాడ నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్‌ వరకు నడుస్తుంది. వారంలో గురువారం ఒక్క రోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఈ ట్రైన్ నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, ఈ ట్రైన్ ప్రతి రోజూ(గురువారం మినహా) ఉదయం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు కి చెన్నై చేరుకుంటుంది. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు వస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు