/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-7-8.jpg)
Raebareli : దేశంలో సార్వత్రిక ఎన్నికల(General Elections) నేపథ్యంలో కాంగ్రెస్(Congress) అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) రాయ్ బరేలీ ప్రచార సభలో భావోద్వేగానికి లోనయ్యారు. రాయ్‌బరేలీ ప్రజలు తమ కుటుంబ సభ్యులని, రాహుల్ ఎల్లప్పుడూ మద్ధతుగా నిలవాలని కోరారు. ఈ మేరకు రాయ్‌బరేలీలోని శివాజీ నగర్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నిర్వహించని బహిరంగ సభలో ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. రాయ్ బరేలీ, అమేథీలను ఎప్పటికీ మర్చిపోలేనని, మూడు దశాబ్దాలుగా సేవ చేసే అవకాశం ఇచ్చారన్నారు. పేదలకు సేవ చేయడమే తన పిల్లలకు నేర్పించానని, ఇక్కడి ప్రజలతో తనకు ఉన్న బంధం గంగామాత అంత పవిత్రమైనదని చెప్పారు.
నా బిడ్డ రాహుల్‌ను మీకు అప్పగిస్తున్నా..
అలాగే తనకు జీవితాంతం రాయ్ బరేలీ ప్రజల ఆశీర్వాదం అండగా ఉందని,. తన తరపున రాహుల్ గాంధీ నిలబెడుతున్నట్లు చెప్పారు. 'నన్ను మీలో ఒకరిగా గుర్తించినట్లే రాహుల్ గాంధీని ఆదరించాలి. నా బిడ్డ రాహుల్‌ను మీకు అప్పగిస్తున్నా. రాయ్ బరేలీ వాసుల్ని రాహుల్ నిరాశపరచడు' అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు సోనియా గాంధీ. ఇక రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాయ్‌బరేలీ ప్రజలతో తమ కుటుంబానికి వందేళ్ల అనుబంధం ఉందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోడానికే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేశానని గుర్తు చేశారు. లోక్‌సభ సభ్యత్యాన్ని, తన ఇంటిని తీసుకున్నారన్నాడు. దర్యాప్తు సంస్థలు విచారించిన తాను బయ పడలేదని, కేంద్ర ప్రభుత్వం ఇంటి నుంచి బయటకు పంపినప్పుడు దేశ ప్రజలు తనకు అండగా నిలబడ్డారంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read : కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ చెంప పగల గొట్టిన యువకుడు
Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. మరోవైపు ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని వెల్లడించారు.
danam nagender brs
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. ఎప్పటినుండో కేసీఆర్ ను చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని.. సభకు కూడా జనం బాగా వస్తారని తాను కూడా అనుకుంటున్నాని తెలిపారు. హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని దానం వెల్లడించారు.
Also read : పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
వ్యక్తిగతంగా బాధించింది
అయితే రాష్ట్ర సీఎస్ శాంతకుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. శాంతకుమారికి మంచి అధికారిగా పేరు ఉందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు. కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్‌పై దానం అనుకూలంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మళ్లీ దానం బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ పోలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read : ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి..? త్రివిధ దళాల మెరుపు దాడుల్లో వీళ్లే మునగాళ్లు
Hansika క్షుద్రపూజలు, ఆత్మలు.. ఏడాది తర్వాత ఓటీటీలో హన్సిక హర్రర్ థ్రిల్లర్!
MLA Aminul Islam : పహల్గాం దాడి వెనుక మోదీ, అమిత్ షా కుట్ర.. అస్సాం ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
Rohit Sharma: కెవ్ కేక.. T20ల్లో రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డు