Sonia Gandhi:రాజ్యసభ కోసం రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్

రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ప్రియాంక, రాహుల్ గాంధీ వెంట రాగా...జైపూర్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు సోనియా గాంధీ.

New Update
Sonia Gandhi:రాజ్యసభ కోసం రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్

Sonia Gandhi Files Nomination for Rajya Sabha: కాంగ్రెస్ తురుఫున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను వరుసగా విడుదల చేస్తోంది కాంగ్రెస్. దీనిలో అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈరోజు ఆమె తన నామినేషన్ పత్రాలను జైపూర్‌లో సమర్పించారు. నామినేషన్ పత్రాలను ఇస్తున్నప్పుడు ఆమె  వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్‌లు ఉన్నారు. దీంతో సోనియా మొదటిసారిగా పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు. ఇంతుకు ముందు వరకు ఆమె యూపీలోని రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా పోటీ చేయలేదు. ఇక రాజస్థాన్ నుంచి రాజ్యసభ స్థానాలు మూడు కాళీ అవుతున్నాయి. వీటికి ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఒకటి కాంగ్రెస్‌కు దక్కనుంది. దీనికే సోనియా గాంధీ నామినేషన్ వేశారు.

Also Read:Delhi:రైతుల మీద మరోసారి టియర్ గ్యాస్…ఉద్రిక్తంగా ఢిల్లీ బోర్డర్లు

రాజ్య సభ అభ్యర్ధుల జాబితా..

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను వరుసగా విడుదల చేస్తోంది కాంగ్రెస్. ఈ లిస్ట్‌ను కాంగ్రెస్ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మొదటి లిస్ట్‌లో రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి అకిలేష్ యాదవ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్‌ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండోరె పోటీ చేయనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు