Mobile Phones: మన ఫోన్ మనల్ని స్పై చేస్తోంది..షాకింగ్ నిజాలు

మన ఫోన్ మనల్ని ట్రాక్ చేస్తోందా..మనం మాట్లాడుకునేవి దానికి వినిపిస్తున్నాయా...అవి అన్నీ వేరే వారికి చేరుతున్నాయా..అంటే అవుననే అంటున్నారు. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో...దానికి సంబంధించిన యాడ్స్ ఫోన్‌లో వస్తున్నాయి కాబట్టి..ఇది నిజమేనని తెలుస్తోంది.

New Update
Make In India: మొబైల్ ఎగుమతుల్లో చైనా, వియత్నాం లను వెనక్కి నెట్టిన మేక్ ఇన్ ఇండియా ఫోన్లు

Phones Spying: ఫోన్లు...వాటి టెక్నాలజీ మీద తాజాగా ఒక నివేదిక వెలువడింది. దీన్ని బట్టి ఫోన్లు మన మాటలు వింటున్నాయని తేలింది. ఇందుకు ఉదాహరణే మనం ఏ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటామో..దాని తాలూకా అడ్వర్టైజ్‌మెంట్ మన ఫోన్‌లో కనిపించడం అని చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్లు..తనలో ఉండే మైక్రోఫోన్లు ద్వారా మ సంభాషణలను గుర్తించి...డేటా సేకరించి, అనుమతించే సాంకేతికతను కలిగి ఉంటున్నాయి. Google, Meta వంటి క్లయింట్‌లను కలిగి ఉన్న మార్కెటింగ్ కంపెనీల ద్వారా యాక్టివ్ లిజనింగ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించబడుతోంది. సేకరించబడిన డేటాకు తగినట్లుగా ప్రకటనలను పంపడం వీటి లక్ష్యంగా మారింది. 404 మీడియా తాజా నివేదికలో దీని గురించి వివరించబడింది.

404 నివేదిక ప్రకారం, కాక్స్ మీడియా గ్రూప్ యొక్క ప్రముఖ మీడియా ప్లేయర్ సంభాషణలను ట్రాక్ చేయడానికి మరియు పర్యవేక్షించడానికి AI- ఇంధనంతో కూడిన యాక్టివ్ లిజనింగ్ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ 470కి పైగా మూలాల నుండి డేటాను లాగుతోంది. వినియోగదారుల ఆన్‌లైన్‌ యాక్టివిటీని గమనించి దానికి తగ్గట్టు బలమైన ప్రోఫైల్‌ను సృష్టిస్తోంది. దీని ద్వారా కంపెనీలు తమ యాడ్స్‌ను ప్రమోట్ చేసుకుంటున్నాయి.

ప్రస్తుతం 404 మీడియా తాజా నివేదిక టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. దీంతో పెద్ద పెద్ద టెక్ కంపెనీలు అన్నీ తమను తాము చెక్ చేసుకోవడం మొదలెట్టాయి. అమెజాన్ ఇప్పటికే సెల్ఫ్ చెక్ చేసుకుని తాము ఇలాంటి టెక్నాలజీకి దూరంగా ఉన్నామని స్పష్టం చేసింది. మెటా కూడా తమ సేవా నిబంధనల మీద విచారణ ప్రారంభించింది. మరోవైపు మీడియా కాక్స్ గ్రూప్ మాత్రం ఈ డేటా సేకరణను సమర్ధిస్తోంది. వినియోగదారులు యాప్‌లను డౌన్‌లో, అప్‌లోడ్ చేసే సమయంలో సర్వీస్ నిబంధనల ద్వారా యాక్టివ్ లిజనింగ్ టెక్నాలజీకి వినియోగదారులు తెలియకుండానే అంగీకరిస్తారని వాదిస్తున్నారు. అయితే కేవలం ఇది విజువల్ మీడియాకు మాత్రమే పరిమితమైంది. ప్రింట్ లోకి వచ్చేసరికి ఇలా ఉండటం లేదు.

వినియోగదారుల డేటాను ఫోన్లు సేకరించడంపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. ఇలా అయితే గోప్యత అనే అంశమే ఉండదని...అందరి జీవితాలు బహిర్గతంఅయిపోతాయనే ఆందోళన మొదలైంది. దీంతో కంపెనీలో పారదర్శక డేటా పద్దతులను పాటించాలని అంటూ ఆందోళన పెరిగింది. దీని కోసం ప్రపంచంలో చాలా ప్రభుత్వాలు సైతం డేటా గోప్యతా చట్టాల మీద ఉక్కుపాదాలు మోపుతున్నాయి. డిజిటల్ హక్కులు మరియు వినియోగదారుల రక్షణల ల్యాండ్‌స్కేప్‌ను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చే సమగ్ర డేటా గోప్యతా బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యులు ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ప్రకారం సాంకేతిక సంస్థలచే వ్యక్తిగత డేటా సేకరణ, వినియోగాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TANA- ATA Scam: 950 ఉద్యోగుల తొలగింపు.. తానా-ఆటా కోసం మ్యాచింగ్ గ్రాంట్స్ కుంభకోణం

తానా, ఆటా వంటి తెలుగు సంఘాలు మ్యాచింగ్ గ్రాంట్స్ కుంభకోణానికి పాల్పడి సంస్థల నిధులను దుర్వినియోగం చేశాయి. ఈ కారణంగా దాదాపు 950 మంది తెలుగు వారు ఉద్యోగాలు కోల్పోయారు. మరో 1500 మంది త్వరలోనే ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంది.

author-image
By Nikhil
New Update
TANA-ATA Scam

TANA-ATA Scam

TANA- ATA Scam: తానా, ఆటా తదితర సంఘాలకు నిధుల పేరుతో పలువురు తెలుగు ఉద్యోగులు సొంత కంపనీలను ముంచారు. మ్యాచింగ్ గ్రాంట్స్ కుంభకోణానికి పాల్పడి 950 మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరో 1500 మంది కూడా త్వరలోనే ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన ఆటా, తానా తదితర సంస్థలు కూడా విచారణ ఎదుర్కోబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు విద్య, ఉద్యోగాల కోసం వెళ్లే తెలుగువారికి అండగా ఉండకుండా.. ఇలాంటి చర్యలకు ప్రోత్సహిస్తున్న సంస్థలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన ఫ్యానీ మే (Fannie Mae) సంస్థ 950 మందిని తొలగించింది. వీరిందరినీ నైతిక కారణాలతోనే తొలగించినట్లు తెలుస్తోంది. తెలుగు సంఘాలు, వాటిని నడిపే పెద్దల కోసం మ్యాచింగ్ గ్రాంట్‌ ప్రోగ్రామ్‌లో అక్రమాలకు పాల్గొనడమే వీరి ఉద్వాసనకు ప్రధాన కారణమని సమాచారం. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA), ఆటా (ATA) వంటి స్వచ్ఛంద సంస్థలు కొందరు ఉద్యోగులతో కుమ్మక్కై వారు పని చేసే కంపెనీ నిధులను దుర్వినియోగం చేశారు. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఒకరు TANA రీజినల్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో కూడా ఉన్నారు. మరొకరు మరో టాప్ సంస్థ ఆటా మాజీ ప్రెసిడెంట్ సతీమణి అని సమాచారం. కేవలం తానా, ఆటా మాత్రమే కాదు.. ఇలాంటి అనేక సంస్థలు కూడా ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ కుంభకోణంలో భాగమైనట్లు తెలుస్తోంది. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

ఈ అసోసియేషన్లు చేసిన అనైతిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు యాపిల్ వంటి ఐటీ దిగ్గజ సంస్థ ఈ ఏడాది జనవరిలో దాదాపు 100కు పైగా ఉద్యోగులను తొలగించింది. వాళ్లంతా కూడా ఈ సంఘాలతో కుమ్మక్కై భారీ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ మేనేజర్ కేడర్ నుంచి ఎంట్రీ లెవల్ ఎగ్జిక్యూటివ్‌ల వరకూ అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అమెరికాలో కంపెనీల ట్యాక్స్ లెక్కలు చూసే ఇంటర్‌నల్ రెవెన్యూ సర్వీస్(IRS) వీళ్ల గుట్టును రట్టు చేసింది. మరో ఐటీ దిగ్గజం గూగుల్ సైతం గతంలో ఇదే రకమైన ఆరోపణలతో తెలుగు ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. 

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

కులానికో సంఘం..

అమెరికాలో ఉన్న తెలుగు వారంతా TANA-తెలుగు అసోసియేషన్ ఫర్ నార్త్ అమెరికా, NATA-నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, ATA- అమెరికన్ తెలుగు అసోసియేషన్, APTA-అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, NATS-నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, NIRVA వంటి సంఘాలుగా ఏర్పడ్డారు. అమెరికాలో కాపులు, కమ్మలు, రెడ్లు కుల సంఘాలుగా ఏర్పడి ఈ ఆర్గనైజేషన్స్ ను నడిపిస్తాయి. యాపిల్ సంస్థ డొనేషన్స్‌ను ఈ తెలుగు సంఘాల్లో ఉన్న ఉద్యోగులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిని తొలగించారు.

Also Read: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

మ్యాచింగ్ గిఫ్ట్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి..

వివిధ కంపెనీలు మ్యాచింగ్ గిఫ్ట్స్ ప్రోగ్రామ్ (Matching Gifts Programme) ద్వారా నాన్-ప్రాఫిట్ సంస్థలకు ఫండింగ్ ఇస్తూ ఉంటాయి. అంటే ఉద్యోగి ఓ సంస్థకు ఎంత డబ్బును విరాళంగా ఇస్తే.. సదరు కంపెనీ కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటుంది. ఈ డబ్బుపై ట్యాక్స్ కూడా ఉండదు. దీంతో ఈ రూల్ ను పలువురు ఉద్యోగులు తమకు అస్త్రంగా మార్చుకున్నారు. ఈ ఉద్యోగులు తానా, ఆటా వంటి సంస్థలతో కుమ్మక్కై తప్పుడు లెక్కలు చూపిస్తారు. తాము విరాళాలు ఇచ్చినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ ను సృష్టిస్తారు.  ఇలా వారు పని చేసే కంపెనీ నుంచి తానా, నాటా లాంటి సంస్థలకు విరాళాలు ఇప్పించి.. ఆ డబ్బులను తమ ఖాతాలకు మళ్లించినట్లు వీరిపై అభియోగాలు ఉన్నాయి. అయితే.. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇలాంటి అవకతవకలకు పాల్పిన వారిపై చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో 1500 మంది కూడా ఇలానే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్న వార్తలు అగ్ర రాజ్యంలో ఉంటున్న తెలుగు వారికి టెన్షన్ పుట్టిస్తోంది.

Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment