Sleep Tips: రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? అయితే జరిగేది ఇదే..! శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిత్రం రాత్రి 7-9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే మన జీవితకాలం తగ్గిపోతుంది. బరువు పెరుగుతారు. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. మానసిక సమస్యలు వస్తాయి. తక్కువ సేపు నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. By Trinath 23 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి మనిషికి నిద్ర అవసరం. తిండి, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం మారుతున్న లైఫ్‌స్టైల్‌ల్లో చాలా మంది బిజీ బతుకుల్లో పడి సరిగ్గా నిద్రపోవడం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్.. ఇంటికి వెళ్లిన తర్వాత ఆఫీస్ వర్క్ చేసేవాళ్ల సంఖ్య పెరుగుతున్నారు. దీని వల్ల టైమ్‌కి నిద్రపోవడం లేదు. నిజానికి వర్క్ పట్ల డెడికేటెడ్‌గా ఉండడం మంచి విషయమే కానీ అది మన ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టి కాదు. అటు విద్యార్థులు సైతం ఈ మధ్య కాలంలో తక్కువ సేపు నిద్రపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఉదయం అంతా ఏదో ఒక విషయంలో టైమ్‌పాస్ చేస్తూ రాత్రి మాత్రం పుస్తకాలు తీసి చదువుతున్నారట. ఇలా నైట్ అంతా చదివి మార్నింగ్ కాస్త లేట్‌గా లేస్తున్నారని తెలుస్తోంది. ఇలా లేట్ నైట్ రీడింగ్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. తెల్లవారుజామున లేచి చదవడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. ఇలా చదువు, వర్క్‌లో పడి రోజుకు మీరు కూడా 7 గంటల కంటే తక్కువ సేపు నిద్రపోతున్నారా? అయితే ఏం జరుగుతుందో తెలుసుకోండి. ➼ రక్తపోటు: తగినంత నిద్ర లేకపోవడం అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ➼ గుండె సమస్యలు: నిత్యం 6 గంటల కంటే తక్కువ నిద్రపోతుంటే అది గుండెపోటు, స్ట్రోక్లతో సహా గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకంగా ఉండే అవకాశం ఉంటుంది. ➼ సామర్థ్యాలపై ప్రభావం: తక్కువ సేపు నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చాలా విషయాలపై శ్రద్ధ పెట్టలేం. సమస్యను పరిష్కారించే నైపుణ్యాల తగ్గిపోతాయి. అంటే మీ అభిజ్ఞా సామర్థ్యాలను నిద్రలేమి దెబ్బతీస్తుంది. ➼ మానసిక సమస్యలు: తక్కువగా నిద్రపోయే వారిలో అనేక మానసిక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రి సరిగ్గా నిద్రలేకపోతే ఉదయం చిరాకు కలుగుతుంది. దీని వల్ల ఇతరులపై చీటికిమాటికి కోపం తెచ్చుకుంటాం. ఆందోళన, నిరాశతో సహా మానసిక ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి దారి తీస్తుంది. ➼ ఆరోగ్య సమస్యలు: దీర్ఘకాలిక నిద్ర లేమి మధుమేహం, ఊబకాయంతో సహా వివిధ ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ➼ రోగనిరోధక వ్యవస్థ: నిద్రలేమి మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఏదైనా వైరస్ లేదా బ్యాక్టిరియా మన శరీరంలోకి ఈజీగా చొచ్చుకురావచ్చు. రోగనిరోధక శక్తి తక్కువ ఉంటే అనేక ఇన్‌ఫెక్షన్లు మనల్ని వేధిస్తాయి. ➼ బరువు పెరుగుట: నిద్ర లేమి ఆకలిని నియంత్రించే హార్మోన్‌లపై ప్రభావం చూపుతుంది. అప్పుడు ఎంత తింటున్నామో అర్థంకాదు. ఎక్కువగా భోజనం చేసే అవకాశం ఉంటుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. ➼ ప్రొడక్టవిటీ: పనిలో లేదా రోజువారీ కార్యకలాపాల్లో సమర్థవంతంగా పని చేసే మీ సామర్థ్యం తగ్గిపోవచ్చు. పని సమయాల్లో నిద్ర కూడా రావొచ్చు. ఓవరల్‌గా ఇది మీ ప్రొడక్టవిటీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ➼ యాక్సిడెంట్లు: సరైన నిద్రలేకుండా రోడ్డుపై రయ్ రయ్ అని వెళ్తే మీ ప్రాణమే పోవచ్చు. లేకపోతే ఇతరుల ప్రాణాలు పోవచ్చు. తీవ్ర గాయాలుపాలు కావొచ్చు. డ్రైవింగ్ చేయడానికి అంతకముందు తగినంత నిద్ర అవసరం. లేకపోతే ➼ డ్రైవింగ్‌లో నిద్ర వస్తుంది. నిద్రమత్తులోకి వెళ్తే ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ➼ జీవితకాలం: నిద్రలేమి వల్ల మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఇదే విషయాన్ని అధ్యయనాలు తేల్చాయి. Also Read: ఈ పండుగలతో ఎన్నో లాభాలు.. మన దేశ గొప్పతనం ఇదే! #sleep-tips #sleep-tips-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి