ప్రముఖ సింగర్‌ విజయలక్ష్మి ఆత్మహత్య.. ఫ్యాన్ కి ఉరేసుకుని!

ప్రముఖ గాయని మల్లికా రాజ్‌పుత్‌ తన ఇంట్లో ఫ్యాన్‌ కు ఉరేసుకుని కనిపించింది. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు

New Update
ప్రముఖ సింగర్‌ విజయలక్ష్మి ఆత్మహత్య.. ఫ్యాన్ కి ఉరేసుకుని!

Singer Suicide: ప్రముఖ గాయని మల్లికా రాజ్‌పుత్‌ (విజయలక్ష్మి) తన ఇంట్లో ఫ్యాన్‌ కు ఉరేసుకుని కనిపించింది. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే గాయనది ఆత్మహత్య లేక హత్య అనేది తెలియనుందని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్‌ పూర్‌ లోని సీతాకుండ్‌ ప్రాంతంలోని మల్లికా రాజ్‌ పుత్‌ (విజయలక్ష్మి ) నివసిస్తున్నారు. మంగళవారం ఆమె తన గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అందరూ నిద్ర పోతుండటం వల్ల ఈ ఘటన ఎప్పుడూ జరిగిందో తమకు తెలియదని కుటుంబ సభ్యులు అంటున్నారు. రాత్రి కుటుంబ సభ్యులతో మల్లికకు గొడవ జరిగినట్లు వారు చెబుతున్నారు.

మల్లికా రాజ్‌పుత్‌ అసలు పేరు విజయలక్ష్మి. తన నటన గానం వంటి ప్రతిభతో సినీ రంగ ప్రవేశం చేసింది. కంగనా రనౌత్‌ తో కలిసి క్రైమ్‌ కామెడీ చిత్రం రివాల్వర్‌ రాణిలో సహాయక పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత ఆమె సింగర్ షాన్ యారా తుజే పాట మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది.

మల్లికా రాజ్‌పుత్ నటన , పాట మాత్రమే కాదు, రాజకీయాలతో కూడా ముడిపడి ఉంది. ఆమె 2016లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు, కానీ రెండేళ్ల తర్వాత ఆ పార్టీని వీడారు. ఆ తర్వాత ఆధ్యాత్మికత వైపు ముందుకు సాగింది. 2022లో ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ సవర్ణ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇది కాకుండా, ఆమె శిక్షణ పొందిన కథక్ నర్తకి, రచయిత, గజల్స్ రాయడంలో నిపుణురాలు.

కంగనా, షాన్‌లతో కలిసి మల్లికకు మంచి పేరు వచ్చినా ఆమె ఎక్కువ కాలం సినిమాని శాసించలేకపోయింది.

Also read: భోజనాల్లో రసగుల్ల అయిపోయిందనుకుని… గుల్లగుల్లగా కొట్టుకున్నారు కదారా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు