Singapore : ఆ పురుగులు తింటే ఆరోగ్యానికి మంచిదే-సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ

పట్టు పురుగులు, మిడతలు, గొల్లభామలు లాంటివి తినడం ఆరోగ్యానికి మంచిదే అంటోంది సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ. మొత్తం 16 రకాల కీటకాలను మానవ ఆహారంగా వినియోగించుకోవచ్చని చెబుతోంది. దీంతో అక్కడ రెస్టారెంట్, హోటల్స్ పండగ చేసుకుంటున్నాయి.

New Update
Singapore : ఆ పురుగులు తింటే ఆరోగ్యానికి మంచిదే-సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ

Singapore Food Agency Approves 16 Insects To Eat : కొరియన్ (Korean), చైనా (China) లాంటి దేశాల్లో పురుగులను, కప్పలు, పాములు లంటివి తినడం చాలా సర్వసాధారణం. అయితే కేవలం అక్కడి వారు మాత్రమే ఇలాంటి ఆహారాన్ని తినగలరు. బయట దేశస్థులు పెద్దగా తినలేరు. కానీ ఇప్పుడు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ చేసిన ప్రకటనతో అక్కడి హోటల్స్, రెస్టారెంట్లు పండగ చేసుకుంటున్నాయి. పురుగులు, మిడతలు, గొల్లభామలు సహా 16 రకాల కీటకాలను మానవ ఆహారంగా వినియోగించుకునేందుకు సింగపూర్‌ ఫుడ్‌ ఏజెన్సీ (Singapore Food Agency) ఆమోదం తెలిపింది. అన్నింటికంటే ఎక్కువగా మిడతలు, గొల్లభామల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయని, ఐరన్‌, జింక్‌, కాపర్‌, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని స్థానిక మీడియా పేర్కొంది. దీంతో హోటల్ రంగానికి పెద్ద ఊతం దొరికినట్టయింది.

కొరియా, సింగపూర్, మలేసియా లాంటి దేశాల్లో పలు జాతులకు చెందిన కీటకాలు, వాటి సంబంధిత ఉత్పత్తుల దిగుమతి మీ ఎటువంట నియంత్రణ లేదు. వీటిని అక్కడి వారు ఎలా అయినా ఉపయోగించుకోవచ్చును. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆమోదంతో దీనికి మరింత ఊతం వచ్చింది. దీంతో అక్కడి హోటళ్ల యాజమాన్యాలు.. చైనా, థాయిలాండ్‌, వియత్నాం నుంచి దిగుమతి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

దాంతో పాటూ ఎప్‌ఎఫ్‌ఏ మరికొన్ని నిబంధనలను పెట్టింది. స్థానికంగా పెంచిన లేదా దిగుమతి చేసుకున్న కీటకాలు (Insects) కచ్చితంగా ఆ నిబంధనలకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా అవి అడవుల నుంచి సేకరించినవి కాకుండా ఉండాలని సూచించింది. సింగపూర్‌ ఆహార నియంత్రణ సంస్థ ఇచ్చిన ఆమోదంతో అక్కడ రెస్టారెంట్లు, కేఫ్‌లు ఫుల్ జోష్‌గా ఉన్నాయి. కొత్త రుచులతో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి.

Also Read:Mumbai: ఆకాశాన్నంటుతున్న ముంబైలో స్టార్ హోటళ్ళ ధరలు..అనంత్ అంబానీ పెళ్ళే కారణం

Advertisment
Advertisment
తాజా కథనాలు