Silver Price: వెండి కొనాలంటే లక్ష పెట్టాల్సిందేనా? పరుగులు పెడుతున్న ధరలు..

బంగారంతో పాటు వెండి ధరలు పెరగడం జరుగుతూ ఉంటుంది. అయితే, ఈసారి వెండి ధరలు బంగారం కంటే వేగంగా పెరగవచ్చని అంచనా. ఈ ఏడాది చివరి నాటికి వెండి ధర కేజీకి లక్ష రూపాయలు దాటవచ్చని భావిస్తున్నారు. అంటే వెండి ధర ప్రస్తుత స్థాయి కంటే 15 నుంచి 20 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది

New Update
Silver Price: వెండి కొనాలంటే లక్ష పెట్టాల్సిందేనా? పరుగులు పెడుతున్న ధరలు..

Silver Price: వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వరుసగా పెరుగుతూ వస్తున్న వెండి కేజీ లక్షరూపాయల వైపు వేగంగా పరిగెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వెండి ధర కేజీకి లక్షరూపాయల  స్థాయిని దాటవచ్చని అంచనా వేస్తున్నారు. మోతీలాల్ ఓస్వాల్ నివేదికలో వెండి ధరలకు సంబంధించి ఈ రకమైన అంచనా వచ్చింది.  ఈ ఏడాది బంగారం కంటే వెండి ధరల పెరుగుదల మెరుగ్గా ఉండవచ్చని ఆ నివేదిక పేర్కొంది. వెండి ధర ప్రస్తుత స్థాయి కంటే 15 నుంచి 20 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది.  చైనా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటంతో వెండికి డిమాండ్ పెరగడం కూడా గమనించవచ్చని నివేదిక చెబుతోంది. 

చైనా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని అంచనా
Silver Price: మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమానీ చెబుతున్న దాని ప్రకారం, చైనా ఆర్థిక వ్యవస్థ 2024 మూడవ త్రైమాసికంలో మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. అక్కడ గత మూడు నుంచి ఐదేళ్లలో పారిశ్రామికంగా వెండికి డిమాండ్‌ పెరిగిందని ఆయన చెప్పారు. అటువంటి పరిస్థితిలో, చైనా ఆర్థిక స్థితిలో మెరుగుదల ఉంటే, వెండి ధరలు పెరగవచ్చు. బంగారం ధరల్లో 3-5 శాతం పెరుగుదల అంచనాతో పోలిస్తే, వెండి ధర ప్రస్తుత స్థాయి కంటే 15-20 శాతం పెరగవచ్చని దమానీ చెప్పారు. వెండి కిలో రూ.80 వేలకు పడిపోయిన తర్వాత కొనుగోలు చేయవచ్చని ఆయన చెబుతున్నారు.

Also Read: బంగారు దుకాణాలపై ఉక్కుపాదం మోపిన ఎన్నికల అధికారులు..జోరుగా ఆన్ లైన్ విక్రయాలు..

సంవత్సరం ప్రారంభంలో బంగారం - వెండి రికార్డు స్థాయికి
Silver Price: 2024 ప్రారంభంలో, దేశీయ మార్కెట్లో బంగారం - వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.  బంగారంతో పోలిస్తే ఈ ఏడాది వెండి ధరలు పెద్దగా పెరగలేదని అంటున్నారు. ప్రస్తుతం బంగారం - వెండి నిష్పత్తి 85 కంటే కొంచెం ఎక్కువగా ఉంది.  ఇది దాని చారిత్రక శ్రేణి 65-75 కంటే చాలా ఎక్కువ. అంటే 10 గ్రాముల బంగారం విలువ సాధారణంగా 1 కిలోగ్రాము వెండి విలువలో 65-75 శాతం ఉంటుంది.

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా దేశంలో పెరిగిన అస్థిరత, US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో సడలింపు కారణంగా బంగారం, వెండి ధరలకు మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. అయితే, పారిశ్రామిక డిమాండ్ పెరగడం వల్ల వెండికి అదనపు ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, ఇతర పునరుత్పాదక ఇంధన వనరులు, కొన్ని ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్‌లో వెండిని ఉపయోగిస్తారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు