Siddharth - Aditi : సిద్దార్థ్ - అదితిల పెళ్ళికి ముహూర్తం ఖరారైందా? సిద్దార్ట్, అదితి పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు నెట్టింట ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం ఈ జంట డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నారట. డిసెంబర్ నెలలోని ఓ మంచి రోజున వీరి పెళ్లి నిశ్చయించారట పెద్దలు. By Anil Kumar 03 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Siddharth - Aditi Rao Hydari Wedding : ఒకప్పటి టాలీవుడ్ (Tollywood) లవర్ బాయ్ సిద్దార్థ్ (Siddharth) హీరోయిన్ అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari) గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. 'మహా సముద్రం' సినిమాలో జంటగా నటించిన ఈ ఇద్దరూ.. ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే ప్రేమించుకున్నారు. ఇక రీసెంట్ గానే తమ రిలేషన్ ని బయటపెడుతూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. వీళ్ళ నిశ్చితార్థం ఇరు కుటుంబాల మధ్య రహస్యంగా జరిగింది. ఈ విషయాన్ని ఇద్దరూ తమ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇక ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధం అయినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. సిద్దార్ట్ - అదితిల పెళ్ళికి (Marriage) ముహూర్తం ఖరారయ్యిందట. Also Read : ఎన్టీఆర్ కి పోటీగా రజినీకాంత్.. దేవర, వేట్టయాన్ మధ్య బాక్సాఫీస్ వార్! పెళ్లి అప్పుడేనా... సిద్దార్ట్, అదితి పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు నెట్టింట ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం ఈ జంట డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నారట. డిసెంబర్ నెలలోని ఓ మంచి రోజున వీరి పెళ్లి నిశ్చయించారట పెద్దలు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వడంతో పాటూ పెళ్లి డేట్ తదితర వివరాలను సిద్దార్థ్ - అదితి స్వయంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వీరి కురుంబ సభ్యులు పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సిద్దార్థ్ - అదితి సినిమాల విషయానికొస్తే.. అదితి రీసెంట్ గానే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి సిరీస్ లో నటించింది. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలు చేస్తోంది. అటు సిద్దార్థ్ ఇండియన్ 2 (Indian 2) మూవీలో కీలక పాత్ర పోషించాడు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూలై 12 న రిలీజ్ కానుంది. #wedding #tollywood #actor-siddharth #aditi-rao-hydari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి