Mount Etna Volcano: పేలిన భారీ అగ్ని పర్వతం..బూడిదమయమైన విమానాశ్రయం!

యూరప్‌ లోని అతిపెద్ద యాక్టివ్‌ అగ్ని పర్వతం అయిన మౌంట్‌ ఎట్నా శుక్రవారం ఒక్కసారిగా బద్దలైయ్యింది. ఈ పేలుడు ధాటికి ఆకాశంలోకి ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాలపై బూడిద వ్యాపించింది.

New Update
Mount Etna Volcano: పేలిన భారీ అగ్ని పర్వతం..బూడిదమయమైన విమానాశ్రయం!

Italy: యూరప్‌ లోని అతిపెద్ద యాక్టివ్‌ అగ్ని పర్వతం అయిన మౌంట్‌ ఎట్నా(Mount Etna) శుక్రవారం ఒక్కసారిగా బద్దలైయ్యింది. ఈ పేలుడు ధాటికి ఆకాశంలోకి ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాలపై బూడిద వ్యాపించింది. కాగా ఈ బూడిద దెబ్బకు ఇటలీలోని కాటానియా విమానాశ్రయాన్ని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో విమాన ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అగ్ని పర్వతం నుంచి ఎగిసి పడిన బూడిద అవ్వడం వల్ల కాటానియా విమానాశ్రయంలోని రన్‌ వే పూర్తిగా నిరుపయోగంగా మారింది. వచ్చే-పోయే విమానాలు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా ఇటలీకి చెందిన నేషనలు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జియోఫిజిక్స్‌ అండ్‌ వాల్కనాలజీ ఆకాశంలో 4.5 కిలో మీటర్ల ఎత్తుకు బూడిద ఎగిసిపడింది అని తెలిపింది.

Also Read: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు