SI Suicide Attempt: "సీమై వన్ ప్లస్ ఫోన్"...ఎస్సై ఆత్మహత్యాయత్నం ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు!

ఉన్నతాధికారుల వేధింపులు, సహచర సిబ్బంది అవమానాలు తాళలేకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు అశ్వారావు పేట ఎస్సై శ్రీరాములు శ్రీను తెలిపారు.దీనికి సంబంధించిన వివరాలన్ని కూడా నావన్ ప్లస్ ఫోన్లో అన్ని అధారాలు ఉన్నాయి.

New Update
SI Suicide Attempt: "సీమై వన్ ప్లస్ ఫోన్"...ఎస్సై ఆత్మహత్యాయత్నం ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు!

Si Suicide Attempt: అశ్వారావు పేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్‌ ఆత్మహత్యయత్నానికి గల కారణాలపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ దారుణం వెనుక ఉన్న కారణాల గురించి ప్రస్తుతం మండల వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. పోలీస్‌స్టేషన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు, జిల్లా ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదులు, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది సహాయ నిరాకరణ వంటి అనేక అనుమానాలు కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఉన్నతాధికారుల వేధింపులు, సహచర సిబ్బంది అవమానాలు తాళలేకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు శ్రీరాములు శ్రీను తెలిపారు.
భార్య, బిడ్డలు గుర్తుకు రావడంతో బ్రతకాలనిపించింది. దీనికి సంబంధించిన వివరాలన్ని కూడా నావన్ ప్లస్ ఫోన్లో అన్ని అధారాలు ఉన్నాయి. కొత్తగూడెం ఎస్బీ అధికారుల స్వాధీనంలో ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఫోన్ ఉంది.తన ఆత్భహత్యాయత్నానికి గల కారణాలను ఫోన్ లో నిక్షిప్తం చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

పూర్తి వివరాల్లోకెళ్తే.. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన ఎస్సై శ్రీరాముల శ్రీను ఫిబ్రవరి నెలలో అశ్వారావుపేటకు బదిలీపై వచ్చారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ పక్కనే ఉన్న క్వార్టర్స్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే కొంతకాలంగా స్టేషన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిబ్బంది, అధికారుల మధ్య సమన్యయం చేసేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు.

ఏమి జరిగిందో తెలియదు కానీ ఆదివారం ఉదయం 8గంటల ప్రాంతంలో పోలీస్‌స్టేషన్‌కు మఫ్టీలో వచ్చిన ఎస్సై శ్రీను కొత్త చట్టాల అమలు దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలిస్తుండగా ఆయన కారును డ్రైవర్‌ అక్కడకు తీసుకొచ్చాడు. కొద్దిసేపటికే డ్రైవర్‌ను అక్కడ దింపి ఇప్పుడే వస్తానంటూ స్వయంగా కారు డ్రైవ్‌ చేసుకుని వెళ్లిపోయారు. మధ్యాహ్నం వరకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆయన గురించి ఆరా తీశారు. ఎస్సై వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వచ్చాయి.

దీంతో స్టేషన్‌ సిబ్బందితోపాటు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి అయినప్పటికీ తిరిగి రాకపోవడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎస్సై మహబూబాబాద్‌ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించినట్లు స్థానిక పోలీసులకు సుమారు రాత్రి 11గంటల సమయంలో సమాచారం అందింది. అయితే మహబూబాబాద్‌ ఆర్తి గార్డెన్‌ సమీపంలో పురుగులమందు తాగి డయల్‌ 108కి స్వయంగా ఎస్సై ఫోన్‌ చేసి సమాచారం అందించారు.

ఈక్రమంలో సెల్‌ఫోన్‌ లొకేషన్‌ను ట్రాప్‌ చేసే పనిలో ఉన్న పోలీసులు లొకేషన్‌ను గుర్తించి అక్కడికి చేరుకున్నారు. అపస్మారకస్థితిలో పడి ఉన్న ఎస్సై శ్రీనును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎస్సై ఆరోగ్యం కుదుటపడితేనే అసలు కారణం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే సీఐ వేధింపులు, కొందరు కానిస్టేబుళ్లతో విభేదాలు, సిబ్బంది సహాయ నిరాకరణ తదితర కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు మహబూబాబాద్‌ మీడియాకు ఎస్సై శ్రీను సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Also read: పుణెలో జికా వైరస్ కలకలం‌..ఇద్దరు గర్భవతులకు పాజిటివ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు