/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-24-1-jpg.webp)
Shreyas Iyer : ఐపీఎల్ 2024(IPL 2024) కోసం కోల్ కత్తా నైట్రేడర్స్(Kolkata Knight Riders) జట్టుకు శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) అందుబాటులోకి రానున్నాడు. ఐపీయల్ టోర్ని(IPL Tourney) కు ముందు జరిగిన ఫిట్ నెస్ టెస్ట్ లో అయ్యర్ ఫిట్ నెస్ సర్టిఫికెట్(Fitness Certificate) ను సాధించాడు.
భారత క్రికెట్ జట్టు(Indian Cricket Team) బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ రాబోయే IPL సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ శిక్షణా శిబిరంలో చేరాడు. హిప్ సర్జరీ కారణంగా అయ్యర్ గతేడాది ఐపీఎల్‌లోను పాల్గొనలేకపోయాడు. అతను తిరిగి గత సెప్టెంబర్ నుంచి క్రికెట్ లోకి అందుబాటులోకి వచ్చాడు. వైజాగ్(Vizag) లో జరిగిన రెండో టెస్టు తర్వాత, అతని కి వెన్ను నొప్పి తిరగబెట్టడంతో మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్ లకు దూరమైయాడు..ఆ తర్వాత గాయం నుంచి కోలుకుని తిరిగి రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సెమీ-ఫైనల్‌లో విదర్భతో జరిగిన మ్యాచ్ లో వెన్నునొప్పితో బాధ పెట్టడంతో చివరి రెండు రోజులు మ్యాచ్ లో పాల్గొనలేదు. ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీ సలహా మేరకు ముంబయి లోని వెన్నెముక నిపుణుడి వద్ద చికిత్స పొందాడు. గాయం నుంచి కోలుకున్న అయ్యర్ తిరిగి కేకేఆర్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు.అయితే, గాయం తీవ్రతరం కాకుండా ఉండటానికి ఫార్వర్డ్ డిఫెన్సివ్ షాట్‌లు ఆడుతున్నప్పుడు అయ్యర్ కాళ్లను అతిగా చాచ వద్దని నిపుణులు సూచించారు. దీంతో ఐపీఎల్ కు ముందు అయ్యర్ ఫిట్ నెస్ టెస్ట్ ను అధిగమించటంతో కోల్ కత్తా నైట్రేడర్స్ జట్టుకు కలిసోచ్చే అంశం.
Also Read : ఈ సాలా కప్ నమ్‌దే.. WPL విజేత బెంగళూరు!