శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే నెయ్యి తినకూడదా..!

నెయ్యిలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యి తినటం వల్ల ఇమ్యూనిటీ పవర్ ను, జీర్ణశక్తిని పెంచుతుందని అంటున్నారు. నెయ్యిని పరిగడుపున తింటే చర్మంపై ముడతలు తొందరగా రావని నిపుణులు చెబుతున్నారు. 

New Update
శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే నెయ్యి తినకూడదా..!

శతాబ్దాలుగా భారతీయ వంటశాలలలో నెయ్యి ప్రధానమైనది. ప్రతి ఒక్కరూ నెయ్యిని దాని రుచి, పోషక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇటీవల నెయ్యిలో సంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నాయి కాబట్టి మనం తినవచ్చా? అనే ప్రశ్న తలెత్తింది. నెయ్యిలో ఆరోగ్య ప్రయోజనాలను అందించే కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.

నెయ్యిలో ఎన్నో రకాల విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వు, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ  ఎన్నో అనారోగ్య సమస్యలను పోగొడుతాయి. నెయ్యి తినడం వల్ల శరీరానికి బలం రావడమే కాదు.. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది చర్మ సమస్యలను కూడా పోగొడుతుంది.

నెయ్యిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యలను తగ్గిస్తాయి. నెయ్యి ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నెయ్యి జీర్ణశక్తిని పెంచుతుంది. అంతేకాదు ఇది మెమోరీ పవర్ ను కూడా పెంచుతుంది. నెయ్యిని పరిగడుపున తింటే కణాల పునరుత్పత్తి బాగుంటుంది. అలాగే చర్మంపై ముడతలు అంత తొందరగా రావు. నెయ్యి తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

నెయ్యి బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా  ఉంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నివారిస్తుంది. దీనిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలున్న నెయ్యిని శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవారు మాత్రం తినడానికి వెనకాడుతారు. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ ను మరింత పెంచుతుందని.

Advertisment
Advertisment
తాజా కథనాలు