Kolkata Doctor Case: సంజయ్‌ రాయ్‌కు బెయిల్‌ ఇవ్వమంటరా ? కోర్టు ఆగ్రహం..

కోల్‌కతా హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్‌ రాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారించింది. నిందితుడు తరఫున న్యాయవాది వాదనలు వినిపించగా.. సీబీఐ తరఫున న్యాయవాది అందుబాటులో లేరు. దీంతో నిందితుడికి బెయిల్ ఇవ్వమంటారా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

New Update
Kolkata Doctor Case: సంజయ్‌ రాయ్‌కు బెయిల్‌ ఇవ్వమంటరా ? కోర్టు ఆగ్రహం..

కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గ్యాంగ్‌రేప్‌ జరగలేదని.. సంజయ్ రాయ్‌ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఇప్పటికే సీబీఐ స్పష్టం చేసింది. దీనిపై విచారణ కూడా తుది దశకు చేరుకుందని చెప్పింది. అయితే నిందితుడు సంజయ్‌ రాయ్ బెయిల్ కోరుతూ కోల్‌కతా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి బెయిల్ ఇవ్వమంటరా అంటూ మండిపడింది.

Also Read: రీడింగ్ గ్లాసెస్‌కు బదులు ప్రెస్వూ ఐ డ్రాప్స్..నిజంగానే పని చేస్తున్నాయా?

ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం సాయంత్రం 4.20 PM గంటలకు కోర్టులో వాదనలు మొదలయ్యాయి. నిందితుడి తరఫున న్యాయవాది కవితా సర్కార్ వాదనలు వినిపించారు. ఆ తర్వాత సీబీఐ తరఫున న్యాయవాది కోర్టు కోరింది. కానీ సీబీఐ న్యాయవాది అయిన దీపర్ పోరియా అందుబాటులో లేరు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడు సంజయ్‌ రాయ్‌కు బెయిల్‌ ఇవ్వమంటారా ? అంటూ అసహనం వ్యక్తం చేసింది. న్యాయవాది కోర్టు హాలులో లేకపోవడం సీబీఐ చట్టవ్యతిరేక ప్రవర్తనకు నిదర్శనం అని పేర్కొంది. ఇలాంటి పని చేయడం దురదృష్టకరమని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పమేలా గుప్తా సీబీఐపై మండిపడ్డారు.

దాదాపు 40 నిమిషాల తర్వాత సీబీఐ తరుఫున న్యాయవాది కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. నిందితుడు సంజయ్‌ రాయ్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించారు. సున్నితమైన ఈ కేసులో సీబీఐ చేసే దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని కోర్టుకు చెప్పారు. చివరికి ఇరువైపుల వాదనలు విన్న కోర్టు సంజయ్‌ రాయ్‌ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. ఇదిలాఉండగా.. ఇప్పటికే సంజయ్‌ రాయ్‌కు కోర్టు సెప్టెంబర్ 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.

Also Read: మహిళకు లిఫ్ట్‌ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డ యువకులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు