/rtv/media/media_files/2025/01/24/tercR1kSDyahabVayA3e.jpg)
Photograph: (Gandhi Bhavan)
Show Cause Notice : పదవుల విషయంలో కొత్తగూడెం జిల్లాకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ గాంధీభవన్ లో తన్నుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయింది. గొడవకు కారణమైన నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ నేతల్లో ముసలం మొదలైంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ లో చేరిన నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తూ మొదటి నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తున్నవారికి అన్యాయం చేస్తున్నారంటూ ఇటీవల గొడవకు దిగారు. కాగా ఈ విషయమై మాట్లాడుకునేందుకు ఇరువర్గాల నేతలు గాంధీభవన్ లో సమావేశమయ్యారు. అయితే సమావేశంలో మాట మాట పెరగడంతో ఇరువర్గాలు కొట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వారిపై చర్యలకు ఉపక్రమించింది.
పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నియమిత గడువులోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొంది. పదవుల విషయంలో వచ్చిన విభేధాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన పలువురు నేతలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి... ఈ గొడవపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గడ్డం రాజశేఖర్, బరగాడి సన్ని, సుధీర్ కుమార్, యాదగిరి ప్రదీప్, గుంపుల రవితేజ తదితర యూత్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.