Seetha Dayakar Reddy : తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీతాదయాకర్ రెడ్డితో పాటు ఆరుగురు సభ్యులను నియమించింది. కంచర్ల వందనగౌడ్, మర్రిపల్లి చందన, బి.అపర్ణ, గోగుల సరిత, ప్రేమలతా అగర్వాల్, బి.వచన్ కుమార్ లను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి మూడు సంవత్సరాలు లేదా వారికి 60 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
ఈ మేరకు గురువారం సీతాదయాకర్ రెడ్డికి నియామకపు ఉత్తర్వులు అందడంతో ఆమె శుక్రవారం మధురానగర్‌లోని కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.1994లో రాజకీయాల్లోకి ప్రవేశించిన సీతా దయాకర్ రెడ్డి 2001 లో దేవరకద్ర జడ్‌పీటీసీ సభ్యురాలుగా విజయం సాధించి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేశారు. 2009లో దేవరకద్ర ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత సీఎస్ దే’
అదే సమయంలో ఆమె భర్త దయాకర్ రెడ్డి సైతం మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో. ఒకే సమయంలో భార్యాభర్తలు అసెంబ్లీలో ప్రవేశించిన ఘనతను సాధించారు. 2014లో దేవరకద్ర ఎమ్మెల్యేగా రెండవసారి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన సీతా దయాకర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల కు కొన్ని వారాల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, విద్యార్హతలు ఉన్న కారణంగా సీతా దయాకర్ రెడ్డి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ గా ప్రభుత్వం నియమించింది. సీతా దయాకర్ రెడ్డికి పదవి దక్కడంతో ఉమ్మడి జిల్లాలో ఉన్న వారి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: బ్యాంకాక్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఎందుకెళ్లారంటే ?