BRS: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎంపీ

కవిత అరెస్టై 24 గంటల కాకముందే కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. మరో ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.

New Update
BRS: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎంపీ

Pasunuri Dayakar Joined Congress: కవిత అరెస్టై 24 గంటల కాకముందే కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. మరో ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ బీఆర్ఎస్ కు (BRS) రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖలు దయాకర్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Also Read: కవితకు బలవంతంగా ఇంజక్షన్‌ పొడిచారు.. లాయర్‌ షాకింగ్‌ ప్రకటన!

కడియమే కారణం..!

ఎంపీ పసునూరి దయాకర్ కు మాజీ సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేదు. అయితే.. తనకే టికెట్ వస్తుందని భావించిన ఎంపీ పసునూరి దయాకర్ టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రోజు సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయిన ఆయన ఈరోజు ఎట్టకేలకు కారు దిగి కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. అయితే.. ఎంపీ పసునూరి దయాకర్ పార్టీ మారడానికి ప్రధాన కారణం మాజీ మంత్రి కడియం శ్రీహరి అని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం కడియం శ్రీహరి అతని కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ లో చేరుతారని భావించిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ను కడియం శ్రీహరి కూతురు కావ్యకు కేటాయించారు. దీంతో ఎంపీ పసునూరి దయాకర్  కు టికెట్ కట్ చేసి కడియం ఆ టికెట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

త్వరలో బీఆర్ఎస్ ఖాళీ..?

బీఆర్ఎస్ పార్టీలో రాజీనామాల పర్వానికి ఇంకా తెరపడడం లేదు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఖాళీ అవుతోందని ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తమతో 26మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ వారు అందరు పార్టీకి రాజీనామా చేస్తే బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం పక్క అని అంటున్నారు రాజకీయ నిపుణులు. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు