Shivaji statue: నేలకూలిన శివాజీ మహారాజ్ విగ్రహం.. కారణం ఏంటంటే ? గత ఏడాది మహారాష్ట్రలో ప్రధాని మోదీ ఆవిష్కరించిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం సోమవారం మధ్యాహ్నం కుప్పకూలింది. గత రెండు మూడురోజులుగా అక్కడ కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలులే ఇందుకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. By B Aravind 26 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి గత ఏడాది మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ప్రధాని మోదీ.. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రాజ్‌కోట్ ఫోర్ట్‌లో ఉన్న ఈ 35 అడుగులు విగ్రహం.. సోమవారం మధ్యాహ్నం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. అయితే గత రెండు మూడురోజులుగా ఆ జిల్లాలో ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. విగ్రహం కూలడానికి ఇవే కారణం కావొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. విగ్రహం కూలిన అనంతరం సమాచారం మేరకు జిల్లా యంత్రాంగం ఘటనాస్థలానికి చేరుకుంది. Also Read: భారత్‌లో టెలిగ్రామ్ యాప్‌పై విచారణ.. త్వరలోనే బ్యాన్ ! విగ్రహం కూలడానికి గల కారణాలు, ఎంతవరకు నష్టం జరిగిందనే దానిపై అంచనా వేస్తున్నారు. 2023 డిసెంబర్ 4న 'నేవీ డే' సందర్భంగా ప్రధాని మోదీ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాజ్‌కోట్ ఫోర్ట్‌లో జరిగిన వేడుకల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఇదిలాఉండగా.. శివాజీ విగ్రహం కూలడానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ఎన్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి జయత్ పటేల్ అన్నారు. ప్రభుత్వమే దానిపై సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకుండా కేవంల ప్రధాని మోదీతో విగ్రహావిష్కరణ చేయడంపైనే దృష్టి పెట్టినట్లు విమర్శలు చేశారు. కొత్త టెండర్లు పిలిచి, కమిషన్లు తీసుకొని కాంట్రాక్టులు ఇవ్వడమే ప్రభుత్వ పని అంటూ సెటైర్లు వేశారు. Also Read: హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తామన్న సీఎం రేవంత్.. ఇది సాధ్యమేనా ? #maharashtra #pm-modi #chatrapathi-sivaji #chatrapathi-sivaji-statue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి