Shikhar Dhawan : వరల్డ్ కప్ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో రోహిత్ కు బాగా తెలుసు.. ఈ సారి కప్ మనదే : శిఖర్ ధావన్ టీ 20వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలుస్తుందని శిఖర్ ధావన్ తన విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లలో భారత్ ఆడుతుంటే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, రోహిత్ శర్మ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. అతనికి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసని తాజా ఇంటర్వ్యూలో అన్నాడు. By Anil Kumar 20 May 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Shikhar Dhawan About Rohit Sharma : ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్ ముగియగానే టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup) మొదలు కానుంది. అందుకు ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే టోర్నీలో పాల్గొనే టీమ్స్ తమ స్క్వాడ్స్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ 20వరల్డ్ కప్ ఆడనున్న టీమిండియా (Team India) ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఈసారి భారత జట్టు విజేతగా నిలుస్తుందని తన విశ్వాసం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీ 20 వరల్డ్ కప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. Also Read : కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన ‘SRH’ ఓపెనర్.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయన్న అభిషేక్ శర్మ! రోహిత్ కి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు " ప్రపంచకప్‌లలో భారత్ ఆడుతుంటే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, రోహిత్ శర్మ (Rohit Sharma) ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. అతనికి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. భారత్ ఈసారి విజయంతో తిరిగి వస్తుందని నమ్ముతున్నా. చాహల్, సంజూ, శివం దుబేకు సరైన అవకాశాలు లభించాయి. వాళ్ళను టీమ్ లో చూసి చాలా సంతోషంగా అనిపించింది. టీమ్ ఇండియా చాలా సమతౌల్యంగా ఉంది" అని పేర్కొన్నాడు. కాగా జూన్ 5వ తేదీన ప్రారంభం కానున్న ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడిన ఉత్సాహంతో ఈ టోర్నీలో రాణిస్తారని ఫ్యాన్స్ అంతా ఆశిస్తున్నారు. జూన్ 5 న ఇండియా టీమ్ ఐర్లాండ్ తో తలపడనుంది. న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. #rohit-sharma #t20-world-cup #ipl-2024 #shikhar-dhawan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి