Shankar Mahadevan : శివుడు ముందు అలాంటి పాటలు పాడుతావా? టాప్‌ సింగర్‌పై భక్తులు ఫైర్!

ఇటివలే గ్రామీ అవార్డు గెలుచుకున్న శంకర్ మహదేవన్ నిన్న ఇషా ఫౌండేషన్‌లో జరిగిన మహాశివరాత్రి వేడుకలో పాల్గొన్నారు. ఆయన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ పాటలను ప్రదర్శించినందుకు విమర్శలు వస్తున్నాయి. దేవుడు ముందు సినిమా పాటలు పాడుతారా అని కొందరు ట్వీట్లు చేస్తున్నారు.

New Update
Shankar Mahadevan : శివుడు ముందు అలాంటి పాటలు పాడుతావా? టాప్‌ సింగర్‌పై భక్తులు ఫైర్!

Shankar Mahadevan : ప్రముఖ సింగర్‌ శంకర్ మహదేవన్(Shankar Mahadevan) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే గ్రామీ అవార్డు(Gaami Award) ను గెలుచుకున్న మహదేవన్‌ నిన్న(మార్చి 9) ఇషా ఫౌండేషన్‌(Isha Foundation) లో జరిగిన మహాశివరాత్రి(Maha Shivaratri) వేడుకల సందర్భంగా ప్రదర్శన ఇచ్చారు. ఈ సమయంలో ఆయన బాలీవుడ్ పాటలను పాడారు. ఈ ప్రదర్శనపై ఒక వర్గం నుంచి విమర్శల వ్యక్తమవుతున్నాయి. మహదేవన్‌ పాటలకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతున్నాయి. ఓ వైపు శంకర్ పాటలను ఫ్యాన్స్‌ అభినందిస్తున్నారు. అదే సమయంలో మహాశివరాత్రి సందర్భంగా బాలీవుడ్ పాటలపై ప్రదర్శన కొంతమందికి నచ్చలేదు. 12 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

ఆయన్ను పిలవద్దు:
కొంతమంది భక్తులు మహదేవన్‌ పాటలకు ఎంజాయ్ చేశారు. అటు సోషల్‌మీడియాలో మాత్రం భక్తసమాజం రెండుగా చీలిపోయింది. పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో పండుగ ప్రత్యక్ష ప్రసారంలో చూసినవారి సంఖ్య ఈసారి పెద్ద సంఖ్యలోనే ఉంది. ఇక ఈ కార్యక్రమానికి నటి పూజా హెగ్డే లాంటి హీరోయిన్లు కూడా హాజరయ్యారు. శంకర్ మహదేవన్ హిందీ సినిమా పాటలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు ఆయనపై విమర్శల దాడి చేశారు. సద్గురుకి కీలక సూచనలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు మహదేవన్‌ను ఆహ్వానించవద్దని కోరారు.


మహాశివరాత్రి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన అర్హుడు కాదని నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు మహదేవన్‌కు మద్దతుగా కొందరు నిలుస్తున్నారు. సినిమా పాటలు పాడవద్దని శివుడు చెప్పలేదు కదా అని రివర్స్ అటాక్ చేస్తున్నారు. కావాలనే మహదేవన్‌ని విమర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Also Read : కాంతారాలో జూనియర్..కన్నడలో వైరల్ అవుతున్న న్యూస్

Advertisment
Advertisment
తాజా కథనాలు