High Court: అత్యాచారం చేశాడని యువతి పిటిషన్.. నిందితునికి సపోర్ట్‌ చేసిన కోర్టు ..

ఓ యువతి తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అచ్యాచారం చేశాడంటూ ఓ ప్రేమికుడిపై కోర్టులో పిటిషన్ వేసింది. పెళ్లి చేసుకుందామని అనుకున్నానని ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదని యువకుడు పిటిషన్‌ వేశాడు. చివరికి కోర్టు యువకుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

New Update
High Court: అత్యాచారం చేశాడని యువతి పిటిషన్.. నిందితునికి సపోర్ట్‌ చేసిన కోర్టు ..

కోర్టులు కొన్ని విచిత్రమైన కేసులపై కూడా కొత్తగా తీర్పులు ఇస్తుంటాయి. అవి కూడా కొంత ఆశ్చర్యంగానూ, ఆలోచించే విధంగానూ ఉంటాయి. అయితే తాజాగా బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పుర్ బెంచ్‌ కూడా ఇలాంటి తీర్పునిచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి.. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడంటూ ఓ ప్రేమికుడిపై కోర్టులో పిటిషన్ వేసింది.

Also Read: పద్మ అవార్డ్ గ్రహీతలను సత్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

అయితే ఆ యువకుడు కూడా కోర్టులో పటిషన్‌ వేశాడు. ఆమెను పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశంతోనే ఉన్నానని.. మేమిద్దరం కూడా శృంగారంలో కూడా పాల్గొన్నామని పేర్కొన్నాడు. కానీ ఆమె తల్లిదండ్రులు మా వివాహానికి అంగీకరించలేదని.. అందుకే వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవాల్సి వచ్చిందని కోర్టుకు చెప్పాడు. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఎం.డబ్ల్యూ.చాంద్‌వానీ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.. ఆ యువకుడి వాదనను అంగీకరించింది.

అత్యాచారం చేశాడని చెప్పలేం..

పెళ్లి చేసుకుంటానన్న వాగ్దానాన్ని మాత్రమే నిందితుడు ఉల్లంఘించాడని.. శారీరక సంబంధం పెట్టుకునేందుకు దాన్నొక సాకుగా వాడుకోలేదని పేర్కొంది. వాగ్దాన ఉల్లంఘన, హామీని నెరవేర్చకపోవడం మధ్య తేడా ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఊహించని పరిస్థితుల వల్ల నిందితుడు తన హామీని నెరవేర్చలేకపోయాడు. వాస్తవానికి అతను ముందునుంచి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు. ఇందుకు తల్లిందడ్రులు అంగీకరించలేదు. కాబట్టి అతడు అత్యాచారం చేశాడని చెప్పలేం అంటూ ధర్మాసనం తేల్చిచెప్పింది. అత్యాచారం చేశాడంటూ ఆ యువతి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

Also Read: పూనమ్‌ మరణం డ్రామాతో కంగుతిన్న జనం.. బీపీ పెంచిన నటి పోస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment