Flight Accident: నడిరోడ్డు మీద కూలిన విమానం...ముగ్గురి మృతి!

పారిస్ లో ఓ చిన్న విమానం నడి రోడ్డుపై కూలిపోయింది. తక్కువ ఎత్తులో ఎగురుతుండగా ఓ విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.

New Update
Flight Accident: నడిరోడ్డు మీద కూలిన విమానం...ముగ్గురి మృతి!

Plane Crash: పారిస్ లో ఓ చిన్న విమానం నడి రోడ్డుపై కూలిపోయింది. తక్కువ ఎత్తులో ఎగురుతుండగా ఓ విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. గాయాలపాలైన మిగతా వారిని రెస్క్యూ సిబ్బంది ఎయిర్ ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పారిస్ లోని డిస్నీల్యాండ్ సమీపంలో ఏ4 మోటార్ వే పై చిన్న ప్యాసింజర్ విమానం ఒకటి కూలిపోయింది. తలకిందులుగా రోడ్డుపై పడడంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు ప్రమాద స్థలంలోనే చనిపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ పోలీసులతో కలిసి అక్కడికి చేరుకుంది. ఈ ప్రమాదంతో ఏ4 మోటార్ వే పై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

Also read:  విహార యాత్రలో ఘోర విషాదం..గల్లంతైన ఓకే కుటుంబంలోని 5గురు సభ్యులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు