లైంగిక వేధింపు కేసులో రూ.9900 కోట్లు జరిమాన విధించిన కోర్టు

ఓ మహిళపై మాజీ భాగస్వామి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అక్కడి ప్రత్యేక న్యాయస్థానం భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత మహిళకు ఏకంగా రూ. 9900 కోట్లు చెల్లించాలని మాజీ భర్తకు హుకుం జారీ చేసింది. ఈ సంచలన తీర్పు అమెరికా ప్రత్యేక న్యాయస్థానంలో చోటు చేసుకుంది.

New Update
లైంగిక వేధింపు కేసులో రూ.9900 కోట్లు జరిమాన విధించిన కోర్టు

అమెరికాలో అనేక రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం.. ఓ వ్యక్తి అంగీకారం లేకుండా వారి వ్యక్తిగత (మాజీ భాగస్వామి) ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్‌ చేయడం నేరం. వ్యక్తిత్వానికి హాని కలిగించే ఉద్దేశంతో చేసే ఇటువంటి చర్యలను ‘రివెంజ్‌ పోర్న్‌’గా వ్యవహరిస్తారు. అమెరికాలో ఈ తరహా సెటిల్‌మెంట్‌లలో భాగంగా భారీ మొత్తాలను చెల్లించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. తాజాగా దావా టెక్సాస్‌ కోర్టు పరిధిలో జరిగింది.

అమెరికాలో నివాసం ఉంటున్న ఓ జంట కొన్నిరోజులు బాగానే కలిసి ఉన్నారు. రానురాను వారి మధ్య విబేధాలు వచ్చి భాగస్వామితో విడిపోయారు. విడిపోయిన తర్వాత తన మాజీ భార్య ప్రైవేటు ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టి అవమానాలకు గురిచేయడం స్టార్‌ చేశాడు. దీంతో ఆమె తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ న్యాయం జరగలేదని భావించి సివిల్‌ కోర్టును ఆశ్రయించింది. ఈ సివిల్‌ దావాపై విచారణ పూర్తిచేసిన ప్రత్యేక న్యాయమూర్తుల బృందం. బాధిత మహిళకు 1.2 బిలియన్‌ డాలర్లు అంటే (సుమారు రూ.9900 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది.

అమెరికాకు చెందిన డీఎల్‌ అనే మహిళ మార్క్వెస్‌ జమాల్‌ జాక్సన్‌ అనే వ్యక్తితో 2016 నుంచి కలిసి జీవించారు. షికాగోలో కొంతకాలం గడిపిన తర్వాత అక్టోబర్‌ 2021న పరస్పర అంగీకారంతో వారిద్దరూ విడిపోయారు. అనంతరం అతడి నుంచి వేధింపులు మొదలయ్యాయి. మాజీ భాగస్వామిని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్న అతడు.. గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను సైట్లలో పెట్టాడు. దీంతోపాటు ఆమె ఇంట్లోని సీసీ కెమెరాలు, మొబైల్‌, ఈ-మెయిల్‌ నుంచి వ్యక్తిగత ఫొటోలను సేకరించి ఆమె అనుమతి లేకుండా సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలను సృష్టించి అందులో పోస్టు చేశాడు. ఆ ఫొటోల లింకులను అమ్మాయి స్నేహితులు, కుటుంబ సభ్యులకూ పంపించాడు. వాటిని ఇంటర్నెట్‌ నుంచి తీసివేయడానికి ప్రయత్నించినా.. అందుకు మీ జీవితం సరిపోదంటూ మాజీ భాగస్వామికి మెసేజ్‌లు పంపించేవాడు.

మాజీ భాగస్వామి చేష్టలతో విసుగు చెందిన ఆ మహిళ చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై 2022 ఏప్రిల్‌లో టెక్సాస్‌లోని హ్యారీస్‌ కౌంటీ సివిల్‌ కోర్టులో దావా వేశారు. అతడి చర్యలతో మానసిక, లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే, నిందితుడు కోర్టుకు రానప్పటికీ.. అతడి తరఫు న్యాయవాది మాత్రం హాజరై వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జ్యూరీ.. మహిళను మానసికంగా వేధించినందుకు 200 మిలియన్‌ డాలర్ల రూ.1600కోట్లతోపాటు ఆమెకు నష్టాన్ని కలిగించినందుకు శిక్షగా మరో రూ.8300 కోట్లు చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై బాధిత మహిళ మాట్లాడుతూ.. వేధింపుల విషయమై స్థానిక పోలీసులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారినుంచి సరైన స్పందన లభించకపోవడంతోనే సివిల్‌ కోర్టును ఆశ్రయించినట్లు బాధిత మహిళ పేర్కొంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

పోర్న్ వీక్షకులకు పోలీసులు బిగ్ షాక్ ఇస్తున్నారు. చైల్డ్ ఫోర్నోగ్రఫీపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌ కేంద్రంగా 3 నెలల్లోనే 15 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. పిల్లల పోర్న్ చూసిన, షేర్ చేసిన కేసులు తప్పవంటున్నారు.

New Update
porn cases

Telangana Police special focus on child pornography

Pornography: పోర్న్ వీక్షకులకు పోలీసులు బిగ్ షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా చైల్డ్ ఫోర్నోగ్రఫీపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇంటర్‌నెట్‌, సోషల్ మీడియా మాధ్యమాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీని చూసినా, పోస్ట్ చేసినవారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లోయిటెడ్ చిల్డ్రన్ పోర్టల్.. చిన్నపిల్లల అశ్లీల వీడియోల క్రియేటింగ్, షేరింగ్, సర్క్యులేటింగ్ చైల్డ్ ఎబ్యూజ్ మెటీరియల్‌లకు పాల్పడే వారిని సులభంగా గుర్తిస్తోంది. ఐపీఅడ్రస్, ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ల వివరాలను సెకరించి ఆయా జిల్లాల సీఐడీ అధికారులకు పంపించి.. సంబంధిత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటున్నారు. 

నిందితుల్లో యువకులే అధికం..

ఇటీవల హైదరాబాద్‌ కేంద్రంగా చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించిన కేసుల్లో ఆరుగురు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు 3 నెలల్లోనే 15 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నిందితుల్లో యువకులే అధికంగా ఉంటున్నట్లు చెప్పారు. కొంతమంది నకిలీ సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా సర్క్యులేట్ చేస్తున్నారని, పేరు, వివరాలు గుర్తించలేరనే ఉద్దేశంతో టెలీగ్రామ్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు చేరవేసుకుంటున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కొందరి ఐపీ అడ్రస్‌తో అసలు నిందితులెవరనేది పోలీసు, నిఘావర్గాలు గుర్తిస్తాయనేది అంచనా వేయలేక.. కేసుల్లో ఇరుక్కుని ఆందోళన చెందుతున్నారు. 

Also read: BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం

కేసులు పెట్టొద్దంటూ క్షమాపణలు..

విద్యారులు, ఉద్యోగార్థులు, పెళ్లీడు యువకులు చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసుల్లో ఇరుక్కుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కేసులు పెట్టొద్దంటూ పోలీసులకు క్షమాపణలు కోరుతున్నాని, పలు సాక్ష్యాల ఆధారంగా కొందరికి కౌన్సెలింగ్ ఇచ్చి మరికొందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. పిల్లలు ఏం చూస్తున్నారనేది గమనించాలని పేరెంట్స్ కు సూచిస్తున్నారు. నిషేధిత వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని, ఇంటర్ నెట్ లో ఏం సెర్చ్ చేస్తున్నారో తరచూ పరిశీలించాలంటున్నారు. వారిపై నిఘా ఉంచామనే అనుమానం రాకుండా జాగ్రత్తగా వ్యవహరించి వారిని తప్పుదోవపట్టకుండా జాగ్రత్తపడాలంటున్నారు. 

Also : BIG BREAKING: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’



porn-movies | child | police | cases | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు