Kunamneni Sambasiva Rao: కామ్రెడ్స్ సంచలన నిర్ణయం..కేసీఆర్ పై బరిలోకి ఆ నేత!!

కామ్రెడ్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అధినాయకుడు వాళ్లతో పొత్తు లేకుండానే ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్టు అభ్యర్థుల జాబితాను ప్రకటించి క్లారిటీ ఇవ్వడంతో షాక్ తిన్న సీపీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ పై పోటీ చేయడానికి ఆ పార్టీ కీలక నేత కూనంనేని సాంబశివరావును బరిలోకి దింపబోతుంది...

New Update
Kunamneni Sambasiva Rao: కామ్రెడ్స్ సంచలన నిర్ణయం..కేసీఆర్ పై బరిలోకి ఆ నేత!!

Kunamneni Sambasiva Rao: కామ్రెడ్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ (BRS)అధినాయకుడు వాళ్లతో పొత్తు లేకుండానే ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్టు అభ్యర్థుల జాబితాను ప్రకటించి క్లారిటీ ఇవ్వడంతో షాక్ తిన్న సీపీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ (KCR) పై పోటీ చేయడానికి ఆ పార్టీ కీలక నేత కూనంనేని సాంబశివరావును బరిలోకి దింపబోతుంది.

దీనికి సంబంధించిన కేసీఆర్ పై పోటీ చేయాలన్న ప్రతిపాదన తనకు వచ్చిందని కూనంనేని మీడియాతో అన్నారు. అయితే కేసీఆర్ గజ్వేల్ (Gajwel) ఇంకా కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది తమ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ తీరు పై ఫైర్ అయ్యారు. కారు పార్టీ మిత్రద్రోహం చేసిందన్నారు.

ఇండియా కూటమి సమావేశానికి వెళ్ళి మేం తప్పు చేశామని బీఆర్ఎస్ అంటోందని కూనంనేని పేర్కన్నారు. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party)తో చాలా ఏళ్లుగా పనిచేశామన్నారు ఆయన. దొంగే దొంగ అన్నట్లుగా కేసీఆర తీరు ఉందని ఆయన ఫైర్ అయ్యారు.

మిత్రధర్మాన్ని బీఆర్ఎస్ మర్చిపోయింది..!

బీఆర్ఎస్ కనీస మిత్రధర్మాన్ని పాటించలేదని కూనంనేని మండిపడ్డారు. బీఆర్ఎస్ తో పొత్తు కంటే ముందే జాతీయ కూటమిలో కమ్యూనిస్టులున్నారని..ఈ విషయం కేసీఆర్ కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టులంటే కేసీఆర్ కు నచ్చదన్నారు. కనీస రాజకీయ విలువలు కూడా కేసీఆర్ పాటించడం లేదని ఆయన విమర్శించారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ కు కమ్యూనిస్టులే మద్దతు ప్రకటించాయన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో కూడా సీపీఐ (CPI), సీపీఎం (CPM) రెండు పార్టీలతో పొత్తు కొనసాగుతుందని ప్రకటించిన కేసీఆర్ ఆ మాట మరిచారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

సెప్టెంబర్ 17 న భారీ సభ..!

సెప్టెంబర్ 17ను కేసీఆర్ ఎందుకు విలీన దినోత్సవంగా ప్రకటించడం లేదని నిలదీసిన కూనంనేని సెప్టెంబర్ 11 నుంచి బస్సు యాత్ర నిర్వహిస్తామన్నారు. అదే విధంగా 17న హైదరాబాద్ లో భారీ సభను నిర్వహిస్తామన్నారు. ఈ సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా కూడా పాల్గొంటారన్నారు. ఇక రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు కూనంనేని సాంబశివరావు.

Also Read: మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడం బీజేపీ ఓర్వలేకపోతోంది: కవిత

Advertisment
Advertisment
తాజా కథనాలు