CBFC: విశాల్ ఆరోపణతో సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం..ఏంటంటే.!!

ప్రముఖ నటుడు విశాల్ చేసిన ఆరోపణపై సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విశాల్ ను లంచం డిమాండ్ చేసింది సెన్సార్ బోర్డులు కాదంటూ ప్రకటించింది. ఆయన నుంచి డబ్బు వసూలు చేసింది థర్డ్ పార్టీ అంటూ వెల్లడించింది. ఈ కేసులో పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సెన్సార్ బోర్డు తెలిపింది.

New Update
CBFC: విశాల్ ఆరోపణతో సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం..ఏంటంటే.!!

ప్రముఖ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోని సినిమా హిందీ వెర్షన్ విషయంలో లంచం ఇచ్చానంటూ సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (Central Board of Film Certification) పై విశాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సెన్సార్ కోసం దాదాపు రూ. 6.5 లక్షల లంచంగా చెల్లించాల్సి వస్తందని ఆరోపించారు. ఈ విధంగా ముంబై సెన్సార్ బోర్డు కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుందంటూ విశాల్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కేంద్ర సమాచార ప్రసారశాఖ అత్యవసరంగా భేటీ అయ్యింది. ఈ సమావేశం అనంతరం సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం తీసుకోవడంతోపాటు విశాల్ చేసిన ఆరోపణలపై కూడా స్పందించింది.

ఇది కూడా చదవండి: హీరో ప్రభాస్ కు షాక్.. సెల్ఫీ కోసం వచ్చి చెంపదెబ్బ కొట్టిన యువతి

విశాల్ ను లంచం డిమాండ్ చేసింది సెన్సార్ బోర్డు సభ్యులు కాదని ప్రకటించింది. ఆయన నుంచి డబ్బులు వసూలు చేసింది థర్డ్ పార్టీ అంటూ సెన్సార్ బోర్డు వెల్లడించింది. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సెన్సార్ బోర్డులో ఇలాంటి పరిణామాలను మళ్లీ జరగకుండా ఉండేందుకు ఇక నుంచి ఆన్ లైన్ లో సినిమాల సెన్సార్ ప్రక్రియ పూర్తి చేస్తామంటూ సెన్సార్ బోర్డు తెలిపింది.

ఇది కూడా చదవండి: ఆన్‌లైన్ బెట్టింగ్‌ కేసులో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ నోటీసులు..

కాగా ఈ మేరకు దర్శక, నిర్మాతలు రిజిస్టర్ చేసుకోవాలని సెన్సార్ బోర్డు తెలిపింది. ఈ ప్రక్రియలో కూడా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ దరఖాస్తు చేసకోవాలంటూ సూచించింది. ప్రతిఏడాది సీబీఎఫ్సీ దగ్గరకు సుమారు 18వేల సినిమాల సెన్సార్ సర్టిఫికేట్ కోసం వస్తుంటాయని...అన్ని సినిమాలు చూడాలంటే సభ్యులకు సమయం పడుతుందన్నారు. కాబట్టి నిర్మాతలు కూడా తమ సినిమాకు ముందుగా సెన్సార్ ఇవ్వాలని కోరకూడదని తెలిపింది. నిబంధనల ప్రకారమే ఇక నుంచి ఆన్ లైన్లో సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సెన్సార్ బోర్డు సూచించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు