/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Senior-leader-Buddha-Venkanna-has-condemned-Chandrababus-arrest-jpg.webp)
జగన్ సొంత కంపెనీలో ప్రజల డబ్బును దోచుకున్నారు
ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న నిరసన చేపట్టారు. ఇంటి నుంచి బయటకి వచ్చిన వెంటనే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. గత నాలుగు రోజులుగా చంద్రబాబు అరెస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ప్రతీ రాష్ట్రంలో సంచలనం అయిందన్నారు. తప్పు చేసి ఉంటే చంద్రబాబు అరెస్ట్ చేయండి అని బుద్ధా వెంకన్న సవాల్ చేశారు. జగన్ సొంత కంపెనీల ద్వారా ప్రజల డబ్బును దోచుకున్నారు. అప్పటి ప్రభుత్వాలు పక్క ఆధారాలతో జగన్‌ని అరెస్ట్ చేశారని బుద్ధా వెంకన్న విమర్శించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాబ్బటి ఇప్పుడు టీడీపీపైన జగన్ కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు. ఎంతోమంది నిపుణులను అడగను చంద్రబాబుపై పెట్టిన కేసులు దుర్మార్గుగం అంటున్నారు.
రిమాండ్‌కు పంపడం దుర్మార్గం
సీఐడీ వాళ్ళు ఆడిటర్‌ను తెస్తే నిజాలు చెప్తానని చెప్పిన మగాడు చంద్రబాబు అన్నారు. న్యాయవ్యవస్థ మీద ఉన్న గౌరవం చంద్రబాబు అరెస్ట్‌తో పోయిందన్నారు. చంద్రబాబు కేసుపై ఇచ్చిన తీర్పు దారుణం అన్నారు. జడ్జి పొజిషన్‌లో ఉంటే ఎదైనా చేయచ్చు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. జడ్జి ఎమైనా చెప్పారా..? నాకు ప్రాణ హాని ఉందని కావాలని గన్ మేన్స్ ఇచ్చారని అన్నారు. చంద్రబాబుకి ఇచ్చిన జడ్జి మెంట్ చాలా తప్పు. చంద్రబాబుని రిమాండ్‌కు పంపడం చాలా దుర్మార్గం అని మండిపడ్డారు. జగన్ అందరిని చాలా మేనేజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి కోర్టులో గాలి జనార్దన్ రెడ్డి అక్కడ ఉన్న జడ్జి మేనేజ్ చేశారని అందరూ చెప్పారు. జడ్జి పోసిషన్‌లో కూర్చుంటే ఎదైనా చేయచ్చు అనుకోవడం తప్పు అని విమర్శలు చేశారు.
అన్ని చెక్ చేయాలి
సీఐడీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్‌తో మాట్లాడండి చంద్రబాబు చెప్తా అన్నారుగా నిజాలు. చంద్రబాబు అరెస్ట్ చాలా తప్పు అంటే మేము తప్పుడు తీర్పు ఇస్తే చూస్తూ ఊరుకోవాలా..? అని మండిపడ్డారు. తీర్పు ఇచ్చిన జడ్జి ఫోన్ డేటా చెక్ చేయాలి, బ్యాంకు అకౌంట్‌లు చెక్ చేయాలి, సీసీ కెమెరాలు అన్ని చెక్ చేయాలన్నారు. ముగ్గురు సుప్రీంకోర్టు నాయమూర్తులను నియమించి చంద్రబాబు కేసుకు నియమించాలని కోరుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానికించారు.
పైశాచిక సంతోషం...
144 సెక్షన్ అమల్లో ఉందంటూ బుద్దా వెంకన్నను అరెస్టు చేసి వన్ టౌన్ పీఎస్ కు తరలించారు పోలీసులు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమన్నారు. సీఎం జగన్ ఓటమి భయంతోనే ఇన్ని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైనాఆధారాలు లేకుండా అరెస్టు చేస్తారా..? అని ప్రశ్నించారు. పాక్షికంగా మీరు పైశాచిక సంతోషం పొందవచ్చేమో..!! కానీ చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకి వస్తారన్నారని దీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో సీఎం జగన్‌ని ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.