Kota Srinivasarao Birth Day Special : డాక్టర్ కావాల్సిన కోట యాక్టర్ ఎలా అయ్యాడో తెలుసా? సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కోటా శ్రీనివాసరావు. ఏ పాత్రలో నైనా ఒదిగిపోయే ఆయన 700 లకు పైగా సినిమాల్లో నటించారు. నేడు ఆయన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అయన సినీ కెరీర్ పై ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. By Anil Kumar 10 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Senior Actor Kota Srinivasa Rao Birthday Special Story : తెలుగు సినీ పరిశ్రమ (Telugu Film Industry) లో నటుడిగా తనకంటూ ప్రత్యేక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao). ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయే ఆయన తన సినీ కెరీర్ లో సుమారు 700 లకు పైగా చిలుకు సినిమాల్లో నటించారు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ప్రతీ పాత్రలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన నేడు(జులై 10) తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అయన సినీ కెరీర్ కు సంబంధించి పలు ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మెగాస్టార్ మూవీతో ఎంట్రీ... కోటా శ్రీనివాసరావు.. కృష్ణా జిల్లా (Krishna District) కంకిపాడులో 1945వ సంవత్సరం.. జులై 10వ తేదీన జన్మించారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. కోట శ్రీనివాసరావు తండ్రి పేరు కోట సీతారామాంజనేయులు. ఈయన పేరు మోసిన ప్రముఖ వైద్యుడు. తన కొడుకును కూడా డాక్టర్ చేయాలనుకున్నాడు. కానీ చిన్ననాటి నుండే కోట శ్రీనివాసరావుకు నాటకాలంటే ప్రాణం. అలా ఒకసారి ‘ప్రాణం ఖరీదు’ నాటకం వేసింది కోట బృందం. ఆ ప్లే చూసిన దర్శకనిర్మాత క్రాంతికుమార్ ఇన్స్‌పైర్ అయ్యి దాన్ని అదే టైటిల్‌తో సినిమాగా తీసాడు. ఆ నాటకంలో నటించిన నటీనటులందరికీ సినిమాలో అవకాశం ఇచ్చాడు క్రాంతికుమార్. హీరోగా మెగాస్టార్‌కు ఇదే మొదటి మూవీ. ఈ విధంగా కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం జరిగింది. Also Read : ‘కార్తీక దీపం’ వంటలక్క కొడుకును చూసారా? స్టార్ హీరోలు కూడా పనికిరారు! 'ప్రతి ఘటన'తో బ్రేక్... నటుడిగా కోట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ‘ప్రతిఘటన’. టి.కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో కోట పండించిన నటన ఆయనకు బాగా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత టి.కృష్ణ దర్శకత్వంలో చేసిన ‘రేపటిపౌరులు’ కూడా కోటలోని విలనిజాన్ని సరికొత్తగా ఆవిష్కరించింది. అహనా పెళ్ళంట!, యముడికి మొగుడు, ఖైదీ నం: 786, శివ, ‘బొబ్బిలిరాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసు గుర్రం.. ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రాజకీయాల్లోనూ రాణించి... ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే..రాజకీయాల్లో కూడా తనదైన ముద్రవేసారు. 1999 ఎన్నికల్లో బీజేపీ (BJP) తరుపున విజయవాడ (Vijayawada) తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. కోట నటనకు ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వివిధ కేటగిరీల్లో తొమ్మిది నంది అవార్డులు కోటను వరించాయి. సినీ, సామాజిక, రాజకీయా రంగాల్లో రాణించిన కోటకు కేంద్రం 2015లో పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ జోడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య తర్వాత ఆ స్థాయి జంటగా వీరికి పేరొచ్చింది. మళ్లీ అలాంటి జంటను తెలుగు తెర చూడలేదు కూడా. ఇద్దరూ కలిసి తెలుగు ప్రేక్షకులకు పంచిన హాస్యం.. అందించిన ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఇప్పటికీ టీవీల్లో, యూట్యూబ్ లో వీళ్ళ ఎవరు గ్రీన్ కామెడీ సీన్స్ ను చూసి ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. #tollywood #telugu-film-industry #kota-srinivasarao-birthday మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి