Assembly Elections: ఎన్నికల వేళ.. డబ్బులు ఎక్కువగా పట్టుబడింది ఆ రాష్ట్రాంలోనే..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కోట్లాది రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుంది. తెలంగాణలో అత్యధికంగా.. రూ.659.2 కోట్ల విలువైన సొమ్ము పట్టుపడగా.. రాజస్థాన్‌లో రూ.650 కోట్ల విలువైన సొమ్ము దొరికింది.

New Update
Assembly Elections: ఎన్నికల వేళ.. డబ్బులు ఎక్కువగా పట్టుబడింది ఆ రాష్ట్రాంలోనే..

ఎన్నికల వచ్చాయంటే ఆ రాష్ట్రాలో ఉండే సందడే వేరు. నాయకుల ప్రచారాలు ఓ వైపు ఉంటే.. మరోవైపు డబ్బులు, మద్యం ఏరులై పారుతుంటాయి. ఎలక్షన్స్‌ అంటే డబ్బులు పంచడం.. డబ్బులు పంచడం అంటే ఎలక్షన్స్ అనే దిగజారిన పరిస్థితికి చేరిపోయామనేది కాదనలేని వాస్తవం. అయితే ఈ నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికారులు కోట్లాది రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. నవంబర్‌ 20వ తేదీ నాటికి కేంద్ర ఎన్నికల సంఘం.. రూ.1760 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచే పట్టుపడటం గమనార్హం. తెలంగాణలో రూ.659. 2 కోట్ల విలువైన సొమ్ము పట్టుపడగా.. రాజస్థాన్‌లో రూ.650.7 కోట్ల విలువైన సొత్తు దొరికాయి.

Also Read: కొవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు..ఐసీఎంఆర్ ఏమని చెప్పిందంటే!

ఇక మధ్యప్రదేశ్‌లో రూ.323.7 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 76.9 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిజోరంలో 49.6 కోట్లు పట్టుబడ్డాయి. ఐదు రాష్ట్రాల్లో.. నగదు, మద్యం, విలువైన లోహాలు, డ్రగ్స్, ఇతర వస్తువులు ఇలా అన్ని కలిపి మొత్తం రూ. 1760 కోట్లు దొరికాయి. అయితే ఈ ఐదు రాష్ట్రాల్లో 2018 ఎన్నికలప్పుడు రూ.239.15 కోట్ల విలువైన సొత్తు పట్టుపడగా.. ఈసారి మాత్రం 636 శాతం అధికంగా దొరికాయని.. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మరోవైపు ఈ ఐదు రాష్ట్రాల కంటే ముందుగా కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్, మెఘాలయ, త్రిపుర, నాగలాండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాష్ట్రాల్లో మొత్తం కలిపి రూ.1400 కోట్ల విలువైన సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ధనప్రభావ నియంత్రణ చర్యలు రాబోయే రోజుల్లో జరగబోయే మిగతా రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయని.. స్పష్టం చేసింది.

Also Read: బెయిల్‌పై బయటకు వచ్చి.. నడిరోడ్డుపై యువతిని పరిగెత్తించి చంపారు..

Advertisment
Advertisment
తాజా కథనాలు