Telangana: సీతారామ ప్రాజెక్ట్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతమైంది. అశ్వాపురం మండలం బి.జి కొత్తూరు వద్ద నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో సీతారామ ప్రాజెక్టు ఫేస్-1 పంప్ హౌస్ మోటార్ ను ఆన్ చేసి దిగువన ఉన్న కాలువలోకి నీటిని విడుదల చేశారు.

New Update
Telangana: సీతారామ ప్రాజెక్ట్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

Minister Tummala: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ ప్రాజెక్టుతో 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ ఏడాదే వైరా ప్రాజెక్టు వరకు నీళ్లు అందించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ను కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించినా, శంకుస్థాపన జరిగి ఏడేళ్ళు అయినా ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా మంత్రిగా అవకాశం దక్కించుకున్న తుమ్మల.. సీతారామ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టి గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో పనులు చేయిస్తున్నారు.

ట్రయల్ రన్ ను చూసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు‌ ట్రయల్ రన్ విజయవంతమైనందుకు ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి పరవళ్ళు తొక్కటంతో పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ భూమాతకు నమస్కరించి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలను పారించటం తన చివరి కోరిక అన్నారు. ఖమ్మం రైతులు కూడా గోదావరి జిల్లాల రైతుల మాదిరిగా సాగు చెయ్యాలని ఖమ్మం సస్యశ్యామలం కావాలన్నదే తన కోరిక అన్నారు. రాష్ట్రం కోసం పాలనలో ఎవరు ఏ సలహా ఇచ్చినా తీసుకుంటామన్నారు. గత 10రోజులుగా ట్రయల్ రన్ ప్రక్రియ పనుల్లో నిమగ్నమై విజయవంతంగా నీటిని విడుదల చేసినందుకు నీటిపారుల శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. గత ప్రభుత్వం మీ మాట వినలేదని, ఇప్పుడు మీ మాట వినే ప్రభుత్వం వచ్చిందన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతమైంది. అశ్వాపురం మండలం బి.జి కొత్తూరు వద్ద నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో సీతారామ ప్రాజెక్టు ఫేస్-1 పంప్ హౌస్ మోటార్ ను ఆన్ చేసి దిగువన ఉన్న కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఈ ట్రయల్ రన్ ను నీటి పారుదల శాఖ అధికారులు విజయవంతంగా నిర్వహించారు. గత ప్రభుత్వం మీ మాట వినలేదని, ఇప్పుడు మీ మాట వినే ప్రభుత్వం వచ్చిందన్నారు.

Also Read:USA: థాంక్యూ సర్ అనడమే తప్పయిపోయింది..

Advertisment
Advertisment
తాజా కథనాలు