AP : ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ సీట్ల సర్థుబాటు.! టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్ధుబాటు ఓ కొలిక్కి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించింది. అయితే సీట్ల పంపకాల్లో మరోసారి పవన్ తగ్గారు. పవన్ 3 సీట్లు తగ్గించుకోగా, టీడీపీ 1 సీటును బీజేపీకి ఇచ్చింది. By Bhoomi 11 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి TDP-Janasena-BJP : ఎట్టకేలకు టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) సీట్ల సర్ధుబాటు ఓ కొలిక్కి వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ మూడు పార్టీల పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ(Assembly) స్థానం కేటాయించినట్లు తెలుస్తోంది. మొత్తం 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్(Parliament) స్థానాల్లో ఈ రెండు పార్టీలు బరిలోకి దిగుతాయి. వీటిలో 10 అసెంబ్లీ, 6లోకసభ స్థానాల్లో బీజేపీ, మిగిలిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఈ మేరకు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్, పవన్ కల్యాణ్, బీజేపీ నేత బైజయంత్ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు టీడీపీ, జనసేన ,బీజేపీ పార్టీలు ఉమ్మడి ప్రకటన చేశాయి. ఇది కూడా చదవండి : మీ ముఖాన్ని బెడ్‌షీట్‌తో కప్పుకుని నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా? #tdp #bjp #ap #janasena #alliance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి