సినిమా బిజీబిజీగా తాప్సీ.. నా కెరీర్లోనే ఎంతో ప్రత్యేకమైన చిత్రం అందుకే ఈ దూరం మనసులో ఉన్నది ఏదైనా డేరింగ్‌గా బయటకు చెప్పే నటీమణుల్లో తాప్సీ కూడా ఒకరు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తాప్సీ గత కొంతకాలంగా సోషల్‌మీడియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పంజాబీ భామ షారుఖ్‌ఖాన్ సరసన డంకీ చిత్రంలో నటిస్తుంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది తాప్సీ. వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల మీడియాకు దూరంగా ఉన్నానని అసలు విషయం బయటపెట్టింది తాప్సీ. By Vijaya Nimma 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manipur violence : మణిపూర్ ఘటనలో నలుగురు అరెస్టు...నిందితుల ఇంటికి నిప్పు..!! మే 4న మణిపూర్‌లో మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. బీజేపీ పాలిత మణిపూర్‌లో పరిస్థితిపై వివరణాత్మక చర్చకు ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి. By Bhoomi 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించాలి: మంత్రి హరీష్‌రావు తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. సీఎం ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించాలని అవసరమైతే హెలికాప్టర్లు ఉపయోగించమని మంత్రి చెప్పారు. అంతేకాకుండా హైదరాబాద్‌ని కూడా ఈ వర్షాలు అతలాకుతులం చేస్తున్నాయి. పలు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కదలకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. By Vijaya Nimma 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Modi surname defamation case: రాహుల్ గాంధీ పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ.!! మోడీ ఇంటిపేరు పరువు నష్టం కేసుకు సంబంధించి గుజరాత్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. న్యాయమూర్తులు బిఆర్ గవాయ్,పికె మిశ్రాలతోకూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది. By Bhoomi 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ West Bengal : హౌరాలోని మంగళహాట్‌లో భారీ అగ్నిప్రమాదం...భయానక వీడియోలు వైరల్..!! పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని మంగళహాట్‌లో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో పలు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ప్రజలంతా ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. దాదాపు 18 అగ్నిమాపక దళ వాహనాలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. By Bhoomi 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Bhadrachalam: భద్రాచలం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి...అలర్ట్‌గా ఉండాలన్న కలెక్టర్...!! భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం 43.90అడుగులకు చేరుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. By Bhoomi 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Dera Baba: డేరా బాబాకు మరోసారి పెరోల్ మంజూరు..ఎన్నిరోజులంటే..? సిర్సాలోని తన ఆశ్రమంలో బాలికలపై అత్యాచారం ఆరోపణలపై రోహ్తక్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు 30 రోజుల పెరోల్ మంజూరైంది. By Bhoomi 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Arvind Kejriwal: అంగన్వాడీ కార్యకర్తలను శిక్షణ కోసం విదేశాలకు పంపుతాం..!! ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) సంచలన ప్రకటన చేశారు. అంగన్ వాడీ కార్యకర్తలను శిక్షణ కోసం విదేశాలకు పంపుతామంటూ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ స్టేడియంలోని ఆడిటోరియంలో వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తల సమక్షంలో అంగన్వాడీ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి రూపొందించిన ఎడ్యుకేషనల్ కిట్‌ను ముఖ్యమంత్రి కేజ్రివాల్, విద్యాశాఖ మంత్రి అతిషి ఆవిష్కరించారు. అంగన్వాడీ కార్యకర్తలను శిక్షణ కోసం విదేశీ విద్యాసంస్థలకు పంపిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అంతే కాకుండా పిల్లల అభివృద్ధికి సంబంధించిన పనుల్లో తప్ప మరే పనిలో పాలుపంచుకోకూడదన్నారు. By Bhoomi 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jaipur Earthquake: జైపూర్‌లో వరుస భూకంపాలు...భయంతో వణికిపోయిన జనాలు..!! రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు వచ్చారు. జైపూర్‌లో బలమైన భూకంపం వచ్చినట్లు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్వీట్ చేశారు. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను అని అన్నారు. By Bhoomi 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn