SBI We Care: SBI వీ కేర్ డిపాజిట్ స్కీం.. పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం ఏది బెటర్? 

సీనియర్ సిటిజన్స్ కోసం ఎస్బీఐ వీ కేర్ డిపాజిట్ స్కీం తీసుకువచ్చింది. సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50% వడ్డీ లభిస్తుంది. ఇక పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం లో ఐదేళ్ల డిపాజిట్లపై  8.2% వడ్డీ లభిస్తుంది. 

New Update
SBI We Care: SBI వీ కేర్ డిపాజిట్ స్కీం.. పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం ఏది బెటర్? 

SBI We Care: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇప్పుడు మార్చి 31, 2024 వరకు 'వీ కేర్ డిపాజిట్' పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అదనపు వడ్డీ ఇస్తుంది. అందువల్ల, చాలా మంది ఈ స్కీంలో పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.

మీరు కూడా ఇలా పెట్టుబడి పెట్టాలని అనుకుంటుంటే.. అందులో పెట్టుబడి పెట్టే ముందు, మీరు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు స్కీంల గురించి తెలుసుకుందాం. అప్పుడు ఎందులో పెట్టుబడి పెట్టడం మీకు మంచి చేస్తుంది అనేది అర్ధం చే

SBI యొక్క WeCare పథకం

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవల SBI We Care పేరుతో సీనియర్ సిటిజన్ల కోసం ఒక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది.
  • ఈ పథకంపై సీనియర్ సిటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ పథకాన్ని రిటైల్ టర్మ్ డిపాజిట్ సెగ్మెంట్ కింద ప్రారంభించారు. 
  • ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అదనపు వడ్డీ ఇవ్వబడుతుంది.
  • మీరు ఈ పథకం కింద ఇప్పుడు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే, మీకు 7.50% వడ్డీ లభిస్తుంది.
  • మెచ్యూరిటీకి ముందు ఉపసంహరణపై అదనపు వడ్డీ ఇవ్వరు. నిర్ణీత వ్యవధిలోగా ఈ పథకం కింద నమోదు చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ప్రయోజనం లభిస్తుంది.
  • ఇప్పుడు ఈ పథకంలో 31 మార్చి 2024 వరకు పెట్టుబడులు పెట్టె అవకాశం ఉంది. 

Also Read: రూపాయి పడిపోయింది! ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే.. 

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 

  • 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు,  పోస్టాఫీసులో ఈ ఎకౌంట్ తెరవవచ్చు.
  • అయితే, VRS తీసుకున్నా వారు 55 సంవత్సరాల కంటే ఎక్కువ -  60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు కూడా ఈ ఎకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. 
  • ఈ పథకం కింద, డబ్బును 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. మెచ్యూరిటీ తర్వాత, ఈ పథకాన్ని 3 సంవత్సరాల పాటు పొడిగించవచ్చు.
  • ఈ పథకం కింద మీరు గరిష్టంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
  • సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన మూలధనం వార్షికంగా 8.2% వడ్డీని పొందుతుంది.
  • ఈ పథకం కింద పెట్టుబడి పెట్టడం ద్వారా, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతున్నారు.
  • ఈ పథకం కింద, వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్, జూలై, అక్టోబర్ - జనవరి మొదటి పని రోజున జమ చేస్తుంది. దీని మెచ్యూరిటీ వ్యవధి 5 ​​సంవత్సరాలు కానీ 1 సంవత్సరం తర్వాత అవసరం అయితే దీని నుంచి డబ్బు వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. 

ఎక్కడ పెట్టుబడి పెడితే ఉపయోగం ఉంటుంది?

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లు 8.20% వడ్డీని అందిస్తున్నాయి. ఇది ఎప్పుడూ ఉండే పథకం కూడా. అలాగే దీనిపై వచ్చే వడ్డీ SBI WeCare పథకం ఇచ్చే వడ్డీ 7.50% కంటే ఎక్కువ. ఇది మాత్రమే కాదు, ఈ రెండు పథకాలు 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటాయి.  మీ డబ్బు రెండు చోట్లా సురక్షితంగా ఉంటుంది. వడ్డీ పరంగా చూసుకుంటే మాత్రం  మీరు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం సరైనది అని చెప్పవచ్చు. 

Watch this interesting Video:

#sbi #investments
Advertisment
Advertisment
తాజా కథనాలు