SBI Jobs: రూ.63వేల శాలరీతో ఎస్బీఐ జాబ్స్.. అప్లికేషన్‌కి గడువు పొడిగింపు..! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా www.sbi.co.in అధికారిక వెబ్సైట్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 439 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు డేట్‌ని అక్టోబర్ 21వరకు పొడిగించారు. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్లతో సహా వివిధ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. By Trinath 05 Oct 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్స్‌కి ఉండే క్రేజ్ చాలా ఎక్కువ. ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్బీఐ జాబ్స్‌కి అప్లై చేసుకునే వారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. క్లర్క్, పీఓ జాబ్స్‌తో ఎస్‌ఓ జాబ్స్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూసే వారు కూడా ఉంటారు. ఎస్బీఐ(SBI)లో వివిధ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గత నెల 16న నోటిఫికేషన్ విడుదలవగా.. రేపటితో దరఖాస్తుల ప్రక్రియ ముగియాల్సి ఉంది. అయితే ఈ డెడ్‌లైన్‌ని అ నెల 21 వరకు పొడిగించారు. దీంతో ఆసక్తితో పాటు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. CLICK HERE FOR OFFICIAL NOTIFICATION స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(www.sbi.co.in) అధికారిక వెబ్సైట్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియను కొనసాగిస్తోంది. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్లతో సహా వివిధ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. అదనంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడు పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 439 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదవగా.. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో 442 మేనేజీరియల్, స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది ఎస్‌బీఐ. ఎస్‌బీఐ రిక్రూట్‌మెంట్ 2023 – రిజిస్ట్రేషన్ తేదీ ఇతర వివరాలు: ➼ ఆన్‌లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: 16.09.2023 నుంచి 21.10.2023 వరకు ➼ ఆన్లైన్ పరీక్ష తేదీ : డిసెంబర్ 2023/ జనవరి 2024 ➼ ఎస్బీఐ ఖాళీలు: 439 రెగ్యులర్ పోస్టులు ➼ కాల్ లెటర్ డౌన్ లోడ్ చేసుకునే తేదీ: పరీక్షకు 10 రోజుల ముందు దరఖాస్తు ఫీజు: ➼ జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్(EWS) కేటగిరీ అభ్యర్థులు రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేయడానికి దశలు: ➼ sbi.co.in/web/careers ఎస్బిఐ కెరీర్ పేజీని విజిట్ చేయండి ➼ ఎస్సీఓ 2023 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి ➼ రిజిస్టర్ చేసుకోండి ➼ అప్లికేషన్ ప్రక్రియను కంటిన్యూ చేయండి. ➼ ఫారం నింపండి .. తర్వాత సబ్మిట్(SUBMIT) చేయండి ➼ భవిష్యత్తు రిఫరెన్స్ కొరకు కాపీని డౌన్ లోడ్ చేసుకోని ప్రింట్ తీసుకోండి. బెనిఫిట్స్ అండ్ అలవెన్స్: ➼ ఇంటి అద్దె భత్యం ➼ సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ ➼ ప్రత్యేక అలవెన్స్ ➼ లీవ్ ట్రావెల్ అలవెన్స్ ➼ డియర్నెస్ అలవెన్స్ ➼ రవాణా భత్యం ➼ మెడికల్ అలవెన్స్ ➼ పెన్షన్ ఫండ్ ➼ వైద్య సదుపాయం ALSO READ: నేషనల్ స్కాలర్‌షిప్ స్కీమ్‌లో దరఖాస్తులు ప్రారంభం..అర్హులు ఎవరంటే? #sbi-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి