IPL: ఐపీఎల్‌పై కన్నేసిన సౌదీ రాజు .. వాటా కొనేందుకు ప్రయత్నాలు

ఐపీఎల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో ఆయన 5 బిలయన్ డాలర్లు పెట్టుబడి పెడతామని ప్రతిపాదించారని.. అలాగే దీన్ని మరిన్ని దేశాలకు విస్తరించేందుకు సాయం చేస్తామని చర్చించినట్లు బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది.

New Update
IPL: ఐపీఎల్‌పై కన్నేసిన సౌదీ రాజు .. వాటా కొనేందుకు ప్రయత్నాలు

ఐపీఎల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేసవిలో జరిగే ఈ లీగ్‌కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ ఉంది. ఇక ఐపీఎల్ మొదలైందంటే కోట్లాది మంది క్రికెట్ అభిమానులు తమ టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు. గత 15 ఏళ్లుగా ఇది విజయవంతంగా దూసుకెళ్తోంది. అయితే ఈ నేపథ్యంలో సౌది అరేబియా ప్రభుత్వం ఐపీఎల్‌పై కన్నేసింది. ఇందులో వాటా కొనుగోలు చేసేందుకు ఆ దేశ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ను 30 బిలియన్ డాలర్ల విలువ గల హోల్డింగ్ కంపెనీగా మార్చే అవకాశాలపై.. బిన్ సల్మాన్, ఆయన సలహాదారులు భారత ప్రభుత్వ అధికారులతో మాట్లాడినట్లు బ్లూంబర్గ్ న్యూస్ తెలిపింది.

Also read: భారీ భూకంపం.. 132కి చేరిన మృతుల సంఖ్య

Also Read: టీమ్ ఇండియాకు షాక్..మెగాటోర్నీ నుంచి హార్దిక్ పాండ్యా అవుట్

ఈ ఏడాది సెప్టెంబర్‌లో సౌదీ రాజు భారత్‌ పర్యటనకి వచ్చినప్పుడు.. ఐపీఎల్‌లో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని ఆయన ప్రతిపాదన చేశారని ..అలాగే ఐపీఎల్‌ను మరిన్ని దేశాలకు విస్తరించేందుకు సహాయం చేస్తామని చెప్పినట్లు పేర్కొంది. కానీ దీనిపై బీసీసీఐ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. అయితే వచ్చే ఏడాది ఎన్నికలు పూర్తైన తర్వాత భారత ప్రభుత్వం, బీసీసీఐ దీనికి పిలుపునిచ్చే అవకాశాలు ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. 2008లో ఐపీఎల్‌ను ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచలోని ఒకానొక ఉత్తమమైన లీగ్‌గా పేరు సంపాదించుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు