APSRTC: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకోసమే అంటోంది ఏపీఎస్‌ ఆర్టీసీ!

సంక్రాంతి పండక్కి సొంతూర్లకి వచ్చే వారి కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,795 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది.

New Update
APSRTC: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకోసమే అంటోంది ఏపీఎస్‌ ఆర్టీసీ!

APSRTC: రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి (Sankranthi) సందడి మొదలైపోయింది. ఇప్పటికే ఏపీ(AP) లో పాఠశాలలకు సెలవులు (Holidays) కూడా ఇచ్చేశారు. తెలంగాణలో కూడా మరో రెండు రోజుల్లో పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు.దీంతో పిల్లల చదువులు కోసం, ఉద్యోగాల రీత్యా పట్టణాల్లో నివసిస్తున్న వారంతా పల్లె బాట పడుతున్నారు.

రద్దీని తగ్గించేందుకు...

సంక్రాంతి పండక్కి రెండు నెలల ముందు నుంచే బస్సు, ట్రైన్‌ టిక్కెట్లు బుక్‌ అయిపోతుంటాయి. దీంతో రైల్వే స్టేషన్లు, బస్‌ స్టాండ్లు ఊర్లకు వెళ్లేవారితో కిక్కిరిసిపోయి ఉంటాయి. దీంతో రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏపీఎస్ ఆర్టీసీ మరో తీపి కబురు ప్రయాణికులకు అందించింది.

ప్రత్యేక బస్సులను...

ఈ సంక్రాంతి సీజన్‌ కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. దీని కోసం ఇప్పటికే 6,795 ప్రత్యేక బస్సులను సిద్దం చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి ఏపీకి వచ్చే వారి కోసం సుమారు 1600 బస్సులను కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు. తాజాగా అదనంగా మరో వెయ్యి బస్సులను కూడా నడిపేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ రెడీ అయ్యింది. పండుగ అయిపోయిన తరువాత మళ్లీ తిరిగి హైదరాబాద్‌ వచ్చే వారికోసం కూడా మరికొన్ని సర్వీసుల నడిపేందుకు సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఈ నెల 15 వరకు..

ఈ స్పెషల్‌ బస్సులన్నింటిలో కూడా మామూలు ఛార్జీలే ఉంటాయని అధికారులు వివరించారు. మరో పక్క తెలంగాణ ఆర్టీసీ కూడా పండక్కి 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 626 సర్వీస్‌ లకు ముందుగా రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది. ఈ నెల 15 వరకు కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు టీఎస్‌ ఆర్టీసీ 1450 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సమాచారం. ఇప్పటికే సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కూడా సంక్రాంతి కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

Also read: జగన్‌ కి షాక్‌ ..టీడీపీ గూటికి పెనమాలూరు ఎమ్మెల్యే!

Advertisment
Advertisment
తాజా కథనాలు