హైదరాబాద్ కు క్యూ కట్టిన జనం .. హైవే జామ్

కోవిడ్ 19 టైంలో చాలా మంది ఊళ్లలో గడపడంతో గడచిన రెండేళ్ల సంక్రాంతికి పెద్దగా ఊళ్లు వెళ్ళడానికి ఇంటరెస్ట్ చూపలేదు. కానీ ..ఈ సంక్రాంతికి తండోపతండాలుగా  వెళ్లారు.దీంతో విజయవాడ హైవే వాహనాలతో కిలోమీటర్ల మేర ట్రఫిక్ జామ్ అయింది. రిటర్న్ జర్నీలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది.

New Update
హైదరాబాద్ కు క్యూ కట్టిన జనం .. హైవే జామ్
TRAFFIC ZAM : ఈ పండగ మూడు రోజులు హైదరాబాద్ బోసిపోయింది. ప్రతీ ఏటా ఈ తంతు జరుగుతున్నా  ఈ ఏడాది ఎందుకనో చాలా మంది  ఊళ్లు వెళ్లారు.  కోవిడ్ 19 వచ్చేటప్పుడు చాలా మంది ఊళ్లలో గడపడంతో గడచినా రెండేళ్లు పెద్దగా ఊళ్లు వెళ్ళడానికి ఇంటరెస్ట్ చూపలేదు. కానీ .. ఈ సంక్రాంతికి తండోపతండాలుగా  వెళ్లారు.దీంతో విజయవాడ జాతీయ రహాదారి వాహనాలతో కిలోమీటర్ల మేర ట్రఫిక్ జామ్ అయింది. ఇప్పుడు మళ్ళీ రితరం వచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి.
జాతీయ రహదారులు బ్లాక్
సంక్రాంతి సంబరాలు ముగిసాయి.  పుట్టిన ఊరుని భారంగావదిలిపెట్టి మళ్ళి తమ రెగ్యులర్ విధులకు హాజరయ్యేందుకు హైదరాబాద్ కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో  ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న సంక్రాంతికి ఊళ్లు వెళ్ళేటప్పుడు విజయవాడ హైవే ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో అందరూ చూసారు. కిలోమీటర్ల మేర ట్రఫిక్ జామ్ అవడంతో ప్రత్యామ్నాయం లేక అలాగే ఊళ్లు వెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా  జాతీయ రహదారులు బ్లాక్ అవడంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. మళ్ళీ రిటర్న్ జర్నీలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. టోల్‌ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో ప్రయాణీకులు ఇబ్బంధులు  పడుతున్నారు. అయితే.. తెలంగాణలో రేపటి నుంచే   స్కూళ్లు రి ఓపెన్ చేస్తుండటంతో ఎలాగయినా ఈ రాత్రికే హైదరాబాద్ చేరుకునేందుకు అందరూ వస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కోక తప్పలేదు. ఇక,, హైవే డాబాలు , చిన్న చిన్న హోటల్స్ సైతం జనాలతో కిక్కిరిసిపోయాయి.
విశాఖ నుంచి అదనపు బస్సులు 
సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికులు తాకిడి ఎక్కువగా ఉండే నేపథ్యంలో విశాఖ  నుంచి సుధూరు ప్రాంతాలకు వెళ్లే వారికోసం ఏపీఎస్  ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది .సంక్రాంతి పండుగ సమయంలో అదనపు బస్సులు వేసిన ఆర్టీసీ చార్జీల  విషయంలో యధావిధిగా కొనసాగిస్తుండటం విశేషం. పండగ నేపథ్యంలో  పండుగ ముగించుకొని తిరుగు ప్రయాణికుల కోసం ఎంతమంది వచ్చినా అదన బస్సులో వేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఆర్ టి వీ కి తెలియజేశారు.విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి అదనప బస్సులు పెంచిన నేపథ్యంలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ అమరసింహుడు ఆర్ టి వీ తో మాట్లాడారు. ప్రయాణీకుల సౌకర్యార్ధం మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదిలా ఉంటె .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  విద్యార్థులకు సంక్రాంతి  శలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆఫర్ తెలంగాణ  ఇచ్చినా బాగుండు అని అందరూ అనుకుంటున్నారు.
ALSO READ :సుందరకాండ నిత్య పారాయణం చేస్తున్నారా ? అయితే .. ఈ జాగ్రత్తలు తప్పని సరి!!
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

YS Jagan: ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్ పై జగన్ ఫస్ట్ రియాక్షన్!

IPS అధికారి ఆంజనేయులు అరెస్ట్ రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారిపోవడానికి నిదర్శనమని YCP అధినేత జగన్ ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని చంద్రబాబు చూస్తున్నాడని ఆరోపించారు.

New Update

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులతో ఆ పార్టీ అధినేత జగన్‌ ఈ రోజు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. బూత్‌ లెవల్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజల తరపున పోరాటాలను మరింత ముమ్మరం చేయాలన్నారు. పార్టీ పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలన్నారు. ఇంకా సమయం ఉందని వేచి చూసే ధోరణి వద్దని హెచ్చరించారు. విశాఖలో రూ.3 వేల కోట్ల భూమిని చంద్రబాబు సర్కార్ ఊరు, పేరు లేని కంపెనీకి కట్టబెట్టిందని ఆరోపించారు. లులూ గ్రూప్‌కు రూ.2 వేల కోట్ల భూమిని కట్టబెట్టారన్నారు. రాజధానిలో నిర్మాణ పనుల అంచనాలను పెంచేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. 

దిగజారిన వ్యవస్థలు..

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని ఈ సమావేశంలో జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. IPS ఆంజనేయులు అరెస్ట్ ఈ పరాకాష్టకు నిదర్శనమని ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెట్టుకొని ఎలాగైనా మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని చూస్తున్నాడని ఆరోపించారు.

(ys-jagan | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment