Akhanda 2 : 'అఖండ 2' లో బాలయ్యను ఢీ కొట్టే విలన్ దొరికేశాడు.. బోయపాటి ఊరమాస్ సెలెక్షన్! 'అఖండ 2' లో విలన్ రోల్ ను బోయపాటి చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నట్లు తెలిసింది. ఈ పాత్ర కోసం బోయపాటి ఇప్పటికే బాబీ డియోల్, సంజయ్ దత్ లాంటి యాక్టర్స్ ని కలిశారట. సినిమాలో విలన్ రోల్ కి సంజయ్ దత్ దాదాపు ఖరారైనట్టు ఇన్సైడ్ వర్గాల ద్వారా సమాచారం అందింది. By Anil Kumar 03 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Sanjay Dutt In Akhanda 2 : టాలీవుడ్ (Tollywood) లో బోయపాటి (Boyapati) - బాలయ్య (Balakrishna) కాంబోకి ఉన్న క్రేజే వేరు. ఇప్పటికే సింహ , లెజెండ్, అఖండ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలుగొట్టిన ఈ కాంబోలో మళ్ళీ మూవీ ఎప్పుడెప్పుడా ఆని అందరూ ఎదురుచూస్తున్నారు. అఖండలో ద్విపాత్రల్లో బాలయ్యబాబు నట విశ్వరూపాన్ని చూపించిన బోయపాటి .. ఇప్పుడు 'అఖండ 2' (Akhanda 2) ను అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 'అఖండ 2' ఓ డిఫరెంట్ జానర్లో విభిన్న కథాంశంతో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కబోతోంది. బోయపాటి ప్రస్తుతం సస్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే 'అఖండ 2' స్టోరీ అంతా శైవత్వం నేపథ్యంలో సాగనుందట. ముఖ్యంగా ఇందులో విలన్ రోల్ ను బోయపాటి చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నట్లు తెలిసింది. Also Read : రేవ్ పార్టీకి నన్ను ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా.. కానీ? – రీతూ చౌదరి షాకింగ్ కామెంట్స్! పవర్ ఫుల్ విలన్ ఇక ఈ పాత్ర కోసం బోయపాటి ఇప్పటికే బాబీ డియోల్, సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ (Bollywood) సీనియర్ యాక్టర్స్ ని కలిశారట. అయితే సినిమాలో విలన్ రోల్ కి సంజయ్ దత్ దాదాపు ఖరారైనట్టు ఇన్సైడ్ వర్గాల ద్వారా సమాచారం అందింది. కాగా ఈ సినిమాలో బోయపాటి దక్షిణభారత దేశంలో ఉండే ఆలయాల ప్రాచుర్యం, వాటి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో వివరించనున్నారట. ఈ క్రమంలోనే సినిమాలో బాలయ్య, సంజయ్ దత్ ల పాత్రల్ని అత్యంత శక్తివంతగా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం 'NBK 109' ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న బాలయ్య.. ఈ సినిమా పూర్తి చేశాక 'అఖండ 2' ని పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది. #tollywood #balakrishna #akhanda-2-movie #sanjay-dutt #boyapati మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి