ప్రియుడిపై ప్రియుడు దాడి.. సంచలనం రేపుతున్న సేమ్ సెక్స్ మర్డర్ సేమ్ సెక్స్ రిలేషన్ కారణంగా ఒక బాలుడు ప్రాణం కోల్పోయిన ఘటన గుజరాత్ లోని జామ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థితో కొన్నాళ్లుగా సంబంధంలో ఉన్న 22 ఏళ్ల యువకుడు, తనకు దూరంగా ఉంటున్నాడని మరో స్నేహితుడితో సాయంతో హతమార్చాడు. By srinivas 02 Dec 2023 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి కొంతకాలంగా తనతో సన్నిహితంగా ఉంటున్న బాలుడు మరొకరితో క్లోజ్ గా ఉండటం తట్టుకోలేక ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. కొన్నాళ్లపాటు వారిద్దరి మధ్య శారీరక సంబంధం కొనసాగుతుండగా ఇంటర్ చదువుతున్న బాలుడు ఆ యవకుడినుంచి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఈర్ష్య పెంచుకున్న యువకుడు లైంగిక దాడి చేసి క్రూరంగా హతమార్చిన ఘటన గుజరాత్ లో సంచలనం రేపింది. ఈ మేరకు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలుడు శుక్రవారం రాత్రి ఇంటికి రాకపోవడం, ఫోన్ కూడా స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆ బాలుడు నిందితుడు, అతడి స్నేహితుడితో కనిపించినట్లు స్థానికులు తెలిపారు. దాంతో, పోలీసులు నిందితుడు, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరం ఒప్పుకున్న నిందితులు, జామ్ నగర్ - కళావద్ హైవే సమీపంలో నేరం జరిగిన ప్రదేశం వద్దకు పోలీసులను తీసుకువెళ్లారు. అక్కడ సగం కాలిన స్థితిలో ఉన్న ఆ బాలుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు, స్థానికంగా 11వ తరగతి చదువుతున్న బాధిత బాలుడు ఒకే ప్రాంతంలో నివసించేవారు. వారి కుటుంబాలు కూడా కొన్ని సంవత్సరాలుగా స్నేహంగా ఉంటున్నాయి. Also read :నా దృష్టిలో అది తప్పు.. కానీ నేటి తరానికి చాలా అవసరం: త్రివిక్రమ్ ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య శారీరక సంబంధం (same-sex relationship) ఏర్పడింది. కొన్నాళ్లుగా ఆ బాలుడు ఈ సంబంధాన్ని వ్యతిరేకిస్తుండడంతో పాటు, వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉండడం గమనించిన నిందిత యువకుడు ఈర్ష్యతో ఆ బాలుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడి సహకారంతో శుక్రవారం రాత్రి ఆ బాలుడిని హత్య చేసి, మృతదేహాన్ని తగలబెట్టడానికి వారిరువురూ ప్రయత్నించారు. చనిపోవడానికి ముందు ఆ బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు వెల్లిడించారు. #same-sex-partner #gujarath #killed సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి