Ambati Rambabu : అంబటి రాంబాబు సంబరాల రాంబాబే ....దుమ్ములేపుతున్న పాట

ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఆయన డాన్స్ చేసినా పాటపాడినా, కామెంట్ చేసినా వైరలవుతాయి. తాజాాగా ఆయన మీద వచ్చిన సంబరాల రాంబాబు పాట వైరల్ గా మారింది.

New Update
Ambati Rambabu : అంబటి రాంబాబు సంబరాల రాంబాబే ....దుమ్ములేపుతున్న పాట

జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ను సంబరాల రాంబాబు అని ఏ ముహుర్తాన అన్నాడో కానీ ఆయన అన్నట్టే అదే ట్యూన్ తో రూపొందించిన పాట ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. సత్తెనపల్లిలో ఆయన చేసిన డెవలప్ మెంట్ ను ప్రశంసిస్తూ రాసిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి :BREAKING: ప్రాణం తీసిన పతంగి సరదా

మరోవైపు అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో (Sankranti festival) అసలు సిసలు సంబరాల రాంబాబుగా మారిపోయారు. పల్నాడు జిల్లా (palnadu district) సత్తెనపల్లి (sattenapalli) లో  స్థానికులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. బంజారా మహిళలతో పాటు స్టెప్పులు వేసి అదరగొట్టారు.  ఆయన భోగి మంటల చూట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. అక్కడున్న వాళ్లను హుషారెత్తించారు.  స్టెప్పులతో హోరెత్తించారు. మంత్రి స్టెప్పులు వేస్తున్న సమయంలో పాల్గొన్న యువత కేరింతలు కొడుతూ మద్దతు పలికారు. డప్పు కళాకారులు బంజారాలతో కలిసి భోగి మంటల చుట్టూ పాటలు పాడుతూ.. డాన్స్ లు చేస్తూ పండుగను ఆస్వాదించారు. ఆయన చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత ఏడాది కూడా అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకల్లో డాన్స్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లు అంబటి అభిమానులు ఆయన మీదా ఒక ప్రత్యేక పాటను విడుదలచేశారు. ఇప్పుడు ఆ పాట ట్రెండింగ్ లో ఉంది. ఆ పాట సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. అవునవును మీరన్నది నిజమేను అంబటి రాంబాబు సంబరాల రాంబాబే. ప్రగతిని పంచే శ్రామికుడు, ప్రజలను కాచే సైనికుడు, సత్తెనపల్లికి సేవకుడు, సత్తువ ఉన్న రాంబాబు, ఆపదవస్తే అండగా నిలిచే మొనగాడు అందుకే మా బాబు అంబటి రాంబాబు, సంబరాల రాంబాబు అంబటి రాంబాబు అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది.

అంబటి రాంబాబు భోగి మంటల చుట్టూ వేసిన స్టెప్పులు.. డాన్స్ కు తగ్గట్టు ఈ పాటను రూపొందించడంతో ఆయన డాన్స్ తో పాటు పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన డాన్స్ పైన పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఆయనను సంబరాల రాంబాబు అంటూ కామెంట్ చేస్తుండగా, పలువురు నెటిజన్లు మాత్రం అంబటి డాన్స్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..అంబటి రాంబాబు రాజకీయాలకు అతీతంగా స్థానికులతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొనడంతో అక్కడి వారంతా ఆనందంతో చప్పట్లు చరుస్తూ ప్రోత్సాహించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: మహిళా నిర్మాతకు యో*ని పూజ.. రూ.10 లక్షలు దొబ్బేసిన అఘోరీ!

లేడీ అఘోరీ మరోమోసం బయటపడింది. యోని పూజ పేరుతో రూ.10లక్షలు దోచేసినట్లు ఓ మహిళా నిర్మాత మొకిలా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

New Update

 Aghori: లేడీ అఘోరీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజల పేరిట భారీ మోసాలకు పాల్పడ్డట్లు  సైబరాబాద్‌ మొకిలా పీఎస్‌లో కేసు నమోదైంది. యోని పూజ చేస్తానంటూ రూ.10 లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ మహిళా నిర్మాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉజ్జయినిలోని ఫాంహౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. రెండు విడతలుగా అఘోరీకి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో ఫిబ్రవరి 25న అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదైంది. 

Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్

ప్రగతి రిసార్ట్స్ కు వెళ్లి..

పోలుసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రొడ్యూసర్ లేడీ అఘోరీతో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు చెప్పింది. దీంతో ప్రొద్దటూర్ లోని ప్రగతి రిసార్ట్స్ కు అఘోరిని డిన్నర్ కు పిలవగా వచ్చినట్లు తెలిపింది. అప్పటి నుంచి ఫోన్ చేస్తూ తన వ్యక్తిగత విషయాలు తెలుసుకుంది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మించింది. అది కూడా ప్రైవేట్ పార్ట్ యోని  పూజ అని చెప్పడంతో నిర్మాత పూజకు అంగీకరించింది. 

Also Read: మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

ఈ క్రమంలోనే పూజ సామాగ్రి కోసం మొదట రూ. 5 లక్షలు అఘోరీ అకౌంట్ లో వేసింది. మొదటిసారి యూపీలోని ఉజ్జయిని ఫాం హౌస్ తీసుకెళ్లి పూజ చేసింది. ఆ తర్వాత మరో రూ.5 లక్షలు ఇవ్వాలని అడిగింది. లేదంటే పూజ విఫలమై ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుందని భయపెట్టింది. భయంతోనే మరో 5 లక్షలు అకౌంట్ లో వేసింది. మొత్తం రూ.10 లక్షలు పంపించినట్లు ఫిర్యాదులో మహిళా నిర్మాత పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. 

 cheating | producer | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment