Samantha : ఆమె నాకు ఆదర్శం.. ఇంటర్‌ విద్యార్థినిపై సమంత ప్రశంసలు!

నటి సమంత నెట్టింట ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. బాల్య వివాహాన్ని ఎదిరించి ఇంటర్ ఫస్టియర్‌లో 421 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచిన కర్నూలు జిల్లాకు చెందిన నిర్మల తనకు ఆదర్శమంటూ పొగిడేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

New Update
Samantha : ఆమె నాకు ఆదర్శం.. ఇంటర్‌ విద్యార్థినిపై సమంత ప్రశంసలు!

Nirmala : స్టార్ నటి సమంత(Samantha) ఏపీ(AP) కి చెందిన విద్యార్థినిపై ప్రశంసలు కురిపించింది. బాల్యంలోనే తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటూ వేధించగా తాను ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయిలో ఉండాలనే పట్టుదలతో విజయతీరాలకు చెరువవుతున్న అమ్మాయే తనకు ఆదర్శం అంటూ సోషల్ మీడియా(Social Media) వేదికగా బాలిక ఫొటోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం సమంత పోస్ట్ వైరల్ అవుతోంది.

బాల్యం వివాహం తప్పించకుని..
అసలు విషయానికొస్తే.. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీ కాలేజి(KGBV College) కి చెందిన ఎస్. నిర్మల ఇంటర్ ఫస్టియర్‌ బైపీసీలో 440 లకు 421 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. అంతే కాదు నిర్మల పదో తరగతిలోనూ 537 మార్కులు సాధించింది. అయితే నిరుపేదలైన నిర్మల తల్లిదండ్రులకు నలుగురు కుతుళ్లున్నారు. ముగ్గురికి పెళ్లిళ్లు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మలకు కూడా చిన్నతనంలోనే పెళ్లి చేయాలని ప్రయత్నించారు. కానీ నిర్మల వారిని ఎదిరించి చదువుకుంటానని పట్టుబట్టింది. కుటుంబ సభ్యులతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది.

ఇది కూడా చదవండి: Rashmika : ‘శ్రీవల్లి 2.0’.. పుష్ప 2 పై క్యూరియాసిటీ పెంచేస్తున్న రష్మిక!

ఈ క్రమంలోనే తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తుంది. అంతేకాదు ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడుతున్నానని చెబుతోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న సమంత.. నిర్మలను పొగుడుతూ నెట్టింట పోస్ట్ పెట్టింది. ఇలాంటి ఆడపిల్లలే రేపటి సమాజానికి ఎంతో ఆదర్శమని కొనియాడింది.

#ap #samantha #nirmala-inter-student
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు