/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T155317.447.jpg)
హైదరాబాద్‌లో ప్రైవేట్ స్కూల్స్‌లో యూనిఫామ్, షూస్, బెల్టులు అమ్మడం నిషేధించబడింది. STATE, CBSE, ICSE పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా ఎడ్యుకేషనల్ అధికారి రోహిణి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రైవేట్ స్కూల్లలో ఈ నిబంధలను అమలు చేస్తున్నా లేదా అని పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: కటింగ్ నచ్చలేదని ఒకరు.. ఎండలో ఆడొద్దన్నందుకు మరొకరు.. 9 ఏళ్ల చిన్నారుల ఆత్మహత్యలు
ఇకపై ప్రైవేట్ స్కూల్స్‌లో యూనిఫామ్, షూస్ అమ్మడం నిషేధం
హైదరాబాద్ - ప్రైవేట్ స్కూల్స్ (STATE, CBSE, ICSE )లో యూనిఫామ్, షూస్ మరియు బెల్ట్లను అమ్మడం నిషేధించబడింది.
స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చు అని ఆదేశాలు జారీ చేయబడినది. pic.twitter.com/gwT7oogrEm
— Telugu Scribe (@TeluguScribe) May 31, 2024