/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-31T211353.885-jpg.webp)
Bollywood: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలాగే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఆమె ఇప్పటివరకు కథా బలమున్న చిత్రాల్లో నటించడం వల్ల తనలోని డ్యాన్సర్‌ను చూపించే అవకాశం రాలేదంటోంది.
APPRECIATION TWEET ⭐
Big love to Mrunal Thakur for bringing Yashna to life❤️💙
Stellar performance!👏#HiNanna | @mrunal0801 pic.twitter.com/HUHuwvbdf9— Paddy (@itspaddyhere) December 9, 2023
అవకాశం రాలేదు..
ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. తన పర్సనల్ అండ్ కెరీర్ గురించి మాట్లాడింది. ‘నేను సీరియస్ స్టోరీల్లో ఎక్కువగా నటించాను. దాంతో ఉర్రూతలూగే డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. ముఖ్యంగా హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి నటించిన ‘సూపర్30’లో ఆయనతో ఆడిపాడే ఛాన్స్ రాకపోయినందుకు చాలా బాధపడ్డా. ‘జెర్సీ’ (Jersy) విషయంలోనూ అంతే. షాహిద్ కపూర్‌తో కలిసి డ్యాన్స్ చేసే పరిస్థితి లేదు. అందుకే ఆయనతో ఎంటర్‌టైనర్ మూవీలో నటించాలనుకుంటున్నా. ఇలా నా సహ నటులంతా మంచి డ్యాన్సర్లే. వారితో సినిమాల్లో డ్యాన్స్ చేసే స్కోప్ లేదు కాబట్టి తెర వెనక చేస్తుంటా. వాటిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటా. ఆ లోటును ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా తీరుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి : Income Tax : పాత vs కొత్త పన్ను విధానాల్లో ఏది బెస్ట్ ఆప్షన్..? జీతభత్యాల ఉద్యోగులకు ఏది మంచిది?
ఆ పాపులారిటీ నాకింకా రాలేదు..
అలాగే 'హిందీలో రొమాంటిక్ చిత్రాల్లో నటించేందుకు నాకు ఛాన్స్ ఎందుకు రావడం లేదో తెలీదు. ప్రేమ కథల్లో నటించే అంతటి పాపులారిటీ నాకింకా రాలేదు అనుకుంటున్నా. ఆ జానర్ చిత్రాల్లో నటించాలని ఉంది. అలాంటివి నేను కూడా చేయగలనని నిరూపించుకోవడంలో విసిగిపోయా. ఇప్పటికే ఎంతోమందిని అడిగా. ఇకపై అది సహజంగా జరగాలని కోరుకుంటున్నా' అని అన్నారు. మహారాష్ట్రకు చెందిన మృణాల్ పలు ధారావాహికల్లో నటించి, 2014లో ‘హలో నందన్’ (మరాఠీ)తో హీరోయిన్‌గా మారారు. ‘లవ్ సోనియా’తో బాలీవుడ్‌లోకి, ‘సీతారామం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సీతామహాలక్ష్మి/ ప్రిన్సెస్ నూర్జహాన్‌గా నటించి తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ‘హాయ్ నాన్న’లో యష్న, వర్షగా అలరించారు. ప్రస్తుతం.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)లో నటిస్తున్నారు.