అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన శ‌బ‌రిమ‌ల ఆలయ కమిటీ.. ఏంటో తెలుసా?

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యాన్ని గురువారం సాయంత్ర 5 గంటలకు తెరవబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. మండ‌ల పూజ సీజ‌న్ సంద‌ర్భంగా రెండు నెల‌ల పాటు ఆ ఆల‌యాన్ని తెర‌చి ఉంచ‌నుండగా కొత్త పూజారిగా పీఎన్ మ‌హేశ్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

New Update
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన శ‌బ‌రిమ‌ల ఆలయ కమిటీ.. ఏంటో తెలుసా?

అయ్యప్ప స్వామీ భక్తులకు శబరిమల అధాకారులు గుడ్ న్యూస్ చెప్పారు. భక్తుల సందర్శన కోసం గుడిని ఓపెన్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం నుంచి ఆలయం తెరిచే ఉంటుందని చెప్పారు. అలాగే ఈ అయ్య‌ప్ప ఆల‌యం ఈసారి భ‌క్తుల్ని విశేషంగా ఆక‌ర్షించ‌నుందన్నారు. ఎంతో ఖర్చుపెట్టి గుడిని మరింత అందంగా అలంకరించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ మేరకు ప్ర‌స్తుతం ఆల‌యం ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద హైడ్రాలిక్ రూఫ్‌ను నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన విశ్వ స‌ముద్ర అనే నిర్మాణ సంస్థ ఆ రూఫ్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఆ కంపెనీ 70 ల‌క్ష‌లు కేటాయించింది.  18 బంగారు మెట్లు ఉండే ప‌దినిట్టం పాడిపై హైడ్రాలిక్ రూఫ్‌ను నిర్మిస్తున్నారు. వ‌ర్షం లేని స‌మ‌యంలో ఆ రూఫ్‌ను ఫోల్డ్ చేసే రీతిలో త‌యారు చేశారు. చెన్నైకి చెందిన క్యాపిట‌ల్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెన్సీ దాన్ని డిజైన్ చేసింది. ప‌డి పూజ స‌మ‌యంలో ఆ రూఫ్ వ‌ల్ల ఇబ్బంది ఉండ‌ద‌ని ఆల‌య అధికారులు చెబుతున్నారు. అలాగే ఆల‌య ఎంట్రెన్స్‌లో కొత్త‌గా రాతి పిల్ల‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఆ శిల‌లు భ‌క్తుల్ని స‌మ్మోహ‌న ప‌ర‌చ‌నున్నాయి. శిల‌ల‌పై అంద‌మైన బొమ్మ‌ను చెక్కారు. స్వామియే శ‌ర‌ణం అయ్య‌ప్ప అని ఆ పిల్ల‌ర్స్‌పై కార్వింగ్ చేశారని వెల్లడించారు. అలాగే మండ‌ల దీక్ష కోసం ఆల‌యాన్ని 60 రోజుల పాటు తెరిచి ఉండనుండగా డిసెంబ‌ర్ 27వ తేదీన ఆ సీజ‌న్ ముగుస్తుంది. తర్వాత మక‌ర సంక్ర‌మ‌ణ పండుగ కోసం డిసెంబ‌ర్ 30వ తేదీన మ‌ళ్లీ ఆల‌యాన్ని ఓపెన్ చేస్తారు. జ‌న‌వ‌రి 15వ తేదీన భారీ సంఖ్య‌లో భ‌క్తుల్ని ఆల‌య ద‌ర్శ‌నం చేసుకోనుండా భక్తులకు ఎలాంటి అటంకాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు