Russia - North Korea : ఉత్తర కొరియాకు మేకలిచ్చిన రష్యా... ఎందుకో తెలుసా!

రష్యా, ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహం గత కొంతకాలంగా బలపడుతోంది. ఈ క్రమంలోనే రష్యా తన మిత్ర దేశానికి వందలసంఖ్యలో మేకలను బహుమతిగా పంపింది.దీని వల్ల అక్కడ కొంతమేర పాల కొరత తగ్గుతుందని రష్యా చెప్పింది.

New Update
Russia - North Korea : ఉత్తర కొరియాకు మేకలిచ్చిన రష్యా... ఎందుకో తెలుసా!

Russia : నియంతృత్వ పాలన సాగిస్తున్న దేశాల్లో ముందు వరుసలో వినిపించే పేర్లు ఏవైనా ఉన్నాయంటే.. అవి కచ్చితంగా రష్యా, ఉత్తర కొరియా (North Korea) మొదటి రెండు స్థానాల్లో నిలుస్తాయి. కొన్ని దశాబ్దాలుగా రష్యాలో వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) కు ఉత్తర కొరియాలో కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (Kim-Jong-Un) కు ఎదురే లేదు. గత కొద్ది రోజులుగా ఈ రెండు దేశాల మధ్య స్నేహ బంధం బలపడింది.

ఈ రెండు దేశాలను మిగిలిన దేశాలు ఎంతలా వ్యతిరేకిస్తుంటే... పుతిన్, కిమ్‌ మధ్య స్నేహం అంత బలంగా మారుతోంది. కాగా వారి స్నేహనికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఉత్తర కొరియాకు 432 మేకలు, 15 మేకపోతులను పంపించింది. గతేడాది పుతిన్-కిమ్ మధ్య శిఖరాగ్ర సమావేశం జరిగిన విషయం తెలిసిందే.

పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారం అందించుకోవాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించుకున్నారు. ఉత్తర కొరియాలో చిన్నారులకు దీర్ఘకాలంగా పాల ఉత్పత్తుల కొరత ఏర్పడింది. ఇప్పుడు పంపిస్తున్న మేకల ద్వారా ఆ లోటును పూర్తి చేసే అవకాశముంటుందని పేర్కొంది.

పశ్చిమ తీర ప్రాంతంలోని రేవు పట్టణం నాంఫో శివార్లలో భారీ మేకల ఫార్మ్ లు నిర్మిస్తున్నారు. రష్యా పంపించిన మేకల ద్వారా ఈ ఫార్మ్ లలో మేకల సంతతిని భారీగా పెంచనున్నారు. దీని వల్ల మేక పాల కొరత తీరుతుందని కిమ్ ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: మాజీ సర్పంచ్‌ భర్త దారుణ హత్య!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ..ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది.దీని పై భగ్గుమన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ...ఏప్రిల్‌ 8 లోగా డ్రాగన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.

New Update
Trump

Trump

అమెరికా ,చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ..ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే.దీని పై భగ్గుమన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ...ఏప్రిల్‌ 8 లోగా డ్రాగన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు.

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

లేదంటే ఏప్రిల్‌ 9 నుంచి 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఆ దేశంతో చర్చలు కూడా నిలిపివేస్తామని తేల్చి  చెప్పారు.అమెరికా పై చైనా 34 శాతం అదనపు సుంకాలను ప్రకటించింది.ఆ దేశం ఇప్పటికే పెద్ద ఎత్తున టారిఫ్‌ లు విధిస్తోంది.కంపెనీలకు అక్రమ రాయితీలు,దీర్ఘకాలికంగా కరెన్సీ అవకతవకలకు పాల్పడుతోంది.

Also Read: Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

నేను హెచ్చరించినప్పటికీ..అదనపు సుంకాల ద్వారా అమెరికా పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ దేశమైనా యత్నిస్తే వెంటనే మరిన్ని టారిఫ్‌ లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ముందు ప్రకటించిన దానికంటే పెద్ద ఎత్తున్న విధిస్తాం. అందువల్ల ..ఏప్రిల్‌ 8 నాటికి చైనా తన 34 శాతం అదనపు సుంకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.

లేకపోతే..ఏప్రిల 9 నుంచే ఆ దేశం పై 50 శాతం అదనపు టారిఫ్‌ లు విధిస్తాం.  ఆ దేశంతో అన్ని చర్చలూ రద్దు చేస్తాం అని సామాజిక మాధ్యమాల వేదికగా ట్రంప్‌ హెచ్చరించారు.అంతకు ముందు ట్రంప్‌ చైనాపై 34 శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించారు. దీనికి డ్రాగన్‌ సైతం దీటుగా స్పందించింది.

రెండువిధాలా వాడుకునేందుకు అవకాశం ఉన్న వస్తువులను అమెరికాకు చెందిన 16 సంస్థలకు ఎగుమతి చేయడం పై నిషేధం విధించాలని నిర్ణయించింది. అమెరికాలోని రక్షణ, కంప్యూటర్‌,స్మార్ట్‌ ఫోన్ల పరిశ్రమలను దెబ్బతీసే రీతిలో కొన్ని రకాల అరుదైన ఖనిజాల ఎగుమతుల పై నియంత్రణలు ప్రకటించింది. దీంతో పాటు ప్రతీకార సుంకాల పై ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యాజ్యం దాఖలు చేసింది.

ఈ  విషయంలో ఇప్పటికే బీజింగ్‌ తీరుఉ,తప్పుపట్టిన ట్రంప్‌..తాజాగా ప్రతీకార సుంకాలను మరింత పెంచతానంటూ స్పష్టం చేశారు.

Also Read: Delhi: ఢిల్లీలో భానుడి భగభగ.. సీజన్‌లో ఆల్ టైం రికార్డు స్థాయి టెంపరేచర్

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

china | america | tarriffs | beijing | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment