Crime News: పిల్లలను ఆకలితో మాడ్చి మాడ్చి హింసించింది.. ప్రముఖ య్యూటుబర్‌కు 60ఏళ్లు జైలు శిక్ష! ప్రముఖ య్యూటబర్ రూబీ ఫ్రాంక్‌కు 60ఏళ్ల జైలు శిక్ష పడింది. తన ఆరుగురి పిల్లలకు తిండి, నీరు, నిద్ర లేకుండా రూబీ హింస పెట్టినట్టు విచారణలో తేలింది. కేసు తీర్పు సమయంలో రూబీ ఏడుపు ఆపుకోలేకపోయింది. తన తప్పులకు పశ్చాత్తాపపడింది. పిల్లలకు క్షమాపణలు చెప్పింది. By Trinath 24 Feb 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి American Vlogger Sentenced to 60Year Jail: ఆమె అమెరికాలో ప్రముఖ యూట్యూబర్.. పేరు రూబీ ఫ్రాంక్.. ఆన్‌లైన్ ద్వారా ఎంతోమందిని అభిమానులను సంపాదించుకున్న ఆమె ఆఫ్‌లైన్‌లో మాత్రం రాక్షస తల్లిగా చెడ్డ పేరు మూటగట్టుకుంది. రూబీ చేసిన దారుణాలు వెలుగుచూడడం.. కోర్టు ఆమెకు 60ఏళ్ల జైలు శిక్ష విధించడం అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సొంత పిల్లలనే హింసించి, బాధించి నరకం చూపించిన రూబీ క్రైమ్ కథలో ఎన్నో ఘోరాలున్నాయి. పిల్లలతో రూబీ నిర్బంధ శిబిరంతో పోల్చిన కోర్టు: ఒకప్పుడు యూట్యూబ్‌లో పిల్లలను ఎలా పెంచాలో సలహా ఇచ్చిన యూట్యూబర్ రూబీ.. తన సొంత పిల్లలను హింస పెట్టిన కేసులో దోషిగా తేలింది. చాలా కాలంగా ఆమె తన పిల్లలను ఆకలితో, దాహంతో ఉంచింది. ఈ కేసులో ఆమెతో పాటు రూబీ బిజినెస్ పార్ట్‌నెర్ జోడీ హిల్డెబ్రాండ్‌కు కూడా శిక్ష విధించింది కోర్టు. రూబీకి ఆరుగురు పిల్లలున్నారు. వారందరిని రూబీ ఎంత హింస పెట్టిందంటే స్వయంగా ప్రాసిక్యూషన్ బాధిత పిల్లల జీవన పరిస్థితులను నిర్బంధ శిబిరంతో పోల్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా రూబీని సమాజానికి పెద్ద ముప్పుగా కూడా అభివర్ణించింది కోర్టు. ఈ కేసు తీర్పు సమయంలో రూబీ ఏడుపు ఆపుకోలేకపోయింది. తన తప్పులకు పశ్చాత్తాపపడింది. పిల్లలకు క్షమాపణలు కూడా చెప్పింది. నీరు కూడా తాగనివ్వని తల్లి: చాలా నెలల పాటు పిల్లలకు తిండి లేకుండా.. పడుకునేందుకు కనీస స్థలం ఇవ్వకుండా రూబీ దారుణాలు చేసింది. పిల్లలు తెలియక తప్పు చేస్తే వారికి మంచి చెప్పాల్సిందిపోయి వారికి కఠిన శిక్షలు విధించేది. నిద్రపోకుండా బెడ్‌రూమ్స్‌కి తాళాలు వేసింది. మిగిలిన రూమ్స్‌లో చెత్తాచెదారం ఉంచి అందులోనే పడుకోమని చెప్పేది. ముఖ్యంగా పెద్ద కొడుకును నానారకాలుగా వేధించింది. తిండి పూర్తిగా పెట్టకుండా సగం ఆకాలితో కడుపు కాలేలా చేసేది. కనీసం మంచి నీరు కూడా లేకుండా చేసింది. ఇంటి బయటకు వెళ్లనిచ్చేది కాదు. ఆమె బయటకు వెళ్లేటప్పుడు ఇంటికి తాళం వేసుకోని వెళ్లేది. ఇలా నెలలపాటు జైలు కంటే ఘోరమైన జీవితం గడిపిన పిల్లల్లో అందరికంటే చిన్నవాడు ఇంటి నుంచి నాటకీయంగా తప్పించుకకున్నాడు. 12 ఏళ్ల పిల్లడు ఇంటి కిటికీ నుంచి తప్పించుకుని పొరుగింటి తలుపు తట్టాడు. అతడిని చూస్తే అస్థిపంజరాన్ని చూసినట్టే అనిపించింది. తనకు ఫుడ్ పెట్టాలని ఏడుస్తూ ఆ పిల్లాడు అడుక్కున్నాడు. వెంటనే షాక్ తిన్న స్థానికులు అసలేం జరిగిందని ఆరా తీశారు. పిల్లాడు జరిగింది జరినట్టు చెప్పడంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. దీంతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు రూబీతో పాటు హిల్డర్‌బ్రాండ్‌ను అరెస్ట్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో రూబీ తన నేరాన్ని అంగీకరించగా కోర్టు తాజాగా జైలు శిక్ష విధించింది. Also Read: అస్థిపంజరంతో ఐదేళ్లు.. తమ్ముడి డెబ్ బాడీని ఇంట్లోనే దాచుకున్న అక్క! #crime-news #america #ruby-franke మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి