Hanamkonda : హన్మకొండలో చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. గర్భినితో సహా 26 మంది హన్మకొండ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి కరీంనగర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు హసన్‌పర్తి పెద్ద చెరువు వద్ద చెట్టును బలంగా ఢీకొట్టింది. 55 మంది ప్రయాణికులుండగా 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. By srinivas 08 Jan 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Road Accident : తెలంగాణ(Telangana) లోని హన్మకొండ(Hanamkonda) లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. దాదాపు 60 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం స్థానికులతోపాటు, ప్రయాణికులను భయాందోళనకు గురిచేయగా.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. #WATCH | Telangana: 26 passengers injured after a bus hit a tree in Hanamkonda (07/01) "The incident took place around 7:30pm. The bus was travelling from Warangal to Karimnagar. There were 55 passengers on the bus, and 26 passengers were injured in the incident. One woman is… pic.twitter.com/52ZPRms4ro — ANI (@ANI) January 8, 2024 ఈ మేరకు హన్మకొండ జిల్లా హసన్‌పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్(Warangal) నుంచి కరీంనగర్(Karimnagar) వెళుతున్న ఆర్టీసీ(RTC) బస్సు హన్మకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి 7:30 ప్రాంతంలో చెట్టును బలంగా ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యు చేపట్టాం. బస్సులో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గర్భిణితో ఉన్న ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించామని కాజీపేట అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ డేవిడ్ రాజు తెలిపారు. గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇది కూడా చదవండి : Ind VS Afg : పొట్టి ఫార్మెట్‌లోకి బాస్, కింగ్ రీఎంట్రీ.. అఫ్ఘాన్‌తో సిరీస్‌కు జట్టు ప్రకటన! ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. #road-accident #rtc-bus #hanmakonda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి