RS Praveen: మా పిల్లలను కుక్కలు, నక్కలుగా చూస్తున్నారు.. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆర్ఎస్పీ ఆందోళన

తెలంగాణ గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, నాయకులు తమ పిల్లలను కుక్కలు, నక్కలుగా చూస్తున్నారని మండిపడ్డారు. విద్యా చేయుతపై కాంగ్రెస్ ప్రభుత్వం ఊసెత్తట్లేదన్నారు.

New Update
RS Praveen: మా పిల్లలను కుక్కలు, నక్కలుగా చూస్తున్నారు.. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆర్ఎస్పీ ఆందోళన

RS Praveen: తెలంగాణ గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల సూర్యాపేట జిల్లాలోని ఇమాంపేట సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల కాలేజీలో ఇంటర్ స్టూడెంట్ దగ్గుబాటి వైష్ణవి (18) అనుమానస్పద మృతిపై బాలిక తల్లిదండ్రులు, బంధువులు చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీవీతో మాట్లాడుతూ వరుస విద్యార్థుల మరణాలు తనను ఎంతో ఆందోళన, ఆవేదనకు గురిచేసిందన్నారు.

సంక్షేమ శాఖలకు మంత్రులు దొరకట్లేదా?
వసతి గృహాల్లో పిల్లలు చనిపోవడం చాలా బాధకరమని, వేలాది మంది పేద బిడ్డలు చదువున్న గురుకులాల్లో ఇలాంటి సంఘటనలు రీపీట్ అవుతుండటం కలవరపెడుతుందన్నారు. ఇటీవలే భువనగిరిలో భవ్యశ్రీ, వైష్ణవి ఉరేసుకుని చనిపోవడం తనను కలిచివేసిందని, భవిష్యత్తు తరాలు ఇలా నేలరాలడం తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. అయితే ఈ వరుస సంఘటనలన్నీ కూడా సాంఘిక సంక్షేమ పాఠశాలలతో జరుగుతుండటం దారుణమని, రెండు నెలలు గడుస్తున్న సంక్షేమ శాఖలకు మంత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 99 శాతం ఓట్లు వేసే బహుజనుల పిల్లలు చదివే హాస్టల్ లో సంక్షేమం కోసం చర్యలు తీసుకునే మంత్రులు దొరకట్లేదా అని ప్రశ్నించారు. రెవెన్యూ, నీటిపారుదల, ఐటీ, ఇండస్ట్రీలే ప్రభుత్వానికి ముఖ్యమైపోయాయని, ఒక వైపు పిల్లల చనిపోతున్నా ఏ నాయకుడు పట్టించుకోవట్లేదని అసహనం వ్యక్తం చేశారు. బాధితుల తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచే నాయకుడు లేడని, కలెక్టర్లు పేరుకే వచ్చి పై పైన విచారించి వెళ్లిపోతున్నారని వాపోయారు. 60 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం మాత్రమే చేస్తుంది తప్పా.. ఏ పని ఆచరణలో చూపించట్లేదన్నారు.

మూడేళ్లుగా మొత్తుకుంటున్న వినట్లేదు..
'గురుకుల పాఠశాలల్లో పిల్లల భద్రతకు సంబంధించిన అంశానని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రతి జిల్లాలోనూ పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వ అధికారులు, నాయకులు దళిత పిల్లలను కుక్కలు, నక్కలుగా చూస్తున్నారు. వారి పిల్లలను మాత్రం ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్లలో చదువించుకుంటున్నారు. వాళ్లకు అన్ని సౌకర్యాలున్నాయి. మా పిల్లలు తిండి, కనీస అవసరాల్లేక నానా తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వ హాస్టల్లలో సైకాలాజిస్టులు, కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని నేను మూడు సంవత్సరాలుగా చెబుతున్నా. అయినా ఎవరూ వినిపించుకోవట్లేదు. నేను ఇన్నాళ్లుగా పోరాడుతున్న దీనిపై ఏ ప్రభుత్వం ఉసేత్తలేదు. టీచర్లకు భయపడే పిల్లలు వారి బాధలు ఎవరికీ చెప్పుకొవాలి? అసెంబ్లీలోనూ చనిపోయిన పిల్లలను తలచుకుంటూ ఒక్క నిమిషం మౌనం పాటించలేకపోతున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై మాట్లాడకపోవండం చాలా బాధకరం' అని అన్నారు.

ఇది కూడా చదవండి : Telangana: తెలంగాణ వ్యతిరేకులకే ప్రగతి భవన్ లో రెడ్ కార్పేట్ వేశారు.. పొన్నం ప్రభాకర్

వాళ్ల దృష్టంతా కబ్జాలపైనే..
ఇక కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టంతా భూములు, కబ్జాలపైనే ఉందన్నారు. గత ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఆరోపణలు చేస్తూ.. భూ దందాలపై చర్చలు చేస్తూ కాలం గడుపుతుందని మండిపడ్డారు. నాయకులంగా కాంట్రాక్టులు, కమీషన్లమీద దృష్టి పెట్టారంటూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు. అరవై రోజులు గడిచినా ఇంత వరకూ ఆ ముచ్చటే ఎత్తట్లేదు. ఆరు గ్యారంటీల్లో ఒకటైన విద్యా చేయుత గ్యారంటీల గురించి ఎందుకు ప్రస్తావించట్లేదని ప్రశ్నించారు. ఒక రకంగా ఈ ప్రభుత్వం పిల్లలపై చేతబడి చేస్తున్నారని వాపోయారు. 5 నెలలుగా మెస్ చార్జీలు లేవు, ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వట్లేదన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చాలా హాస్టల్లకు సొంత బిల్డింగ్ లేవని గుర్తు చేశారు. గవర్నమెంట్ నిర్లక్ష్యానికి ఎప్పుడూ పేద పిల్లలే బలికావాలా? ధనవంతులు ఎందుకు ఇలా ఆత్మహత్యలు చేసుకోవట్లేదంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఏంపీగా పోటీ..
అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, లిక్కరు సీసాలు, దావత్ లతో ప్రజలను మభ్యపెట్టి ప్రధాన పార్టీల నాయకులు ఓట్లు వేయించుకున్నారన్నారని చెప్పారు. ఇవేవీ ఖర్చు చేయకున్నా తనకు 45లకు పైగా ఓట్లు వచ్చాయని, భవిష్యత్తులో తమ పార్టీని ప్రజలు తప్పకుండా గెలిపిస్తారనే నమ్మకంతో ముందుకెళ్తామని తెలిపారు. 'నా ప్రత్యర్థులు 40 కోట్లు ఖర్చు చేశారు. నేను రూపాయి పెట్టలేదు. ఇంకా ఎన్ని రోజులు ఓట్లను కొనే రాజకీయాలు నడుస్తాయి? త్వరలోనే అంబేడ్కర్, కాన్సిరామ్, జ్యోతిబాపూలే కలలు గన్న ప్రభుత్వం వస్తుంది. ప్రజల్లోకి నేను ఇంకా వెళ్లాల్సివుంది' అన్నారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగడం, ఇతర పార్టీలతో పోత్తులపై మాట్లాడుతూ.. పెద్దపల్లి, నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తున్నట్లు వార్తలొస్తుంది నిజమే. కానీ మాయవతి నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. ఆమె దిశానిర్దేశం ప్రకారమే ముందుకెళ్తానని, తెలంగాణలో 99 శాతం ఉన్న బహుజనుల కోసం తాను కష్టపడి పనిచేస్తానన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు