BREAKING: జనసేనకు షాక్‌.. గాజు గ్లాసు గుర్తు రద్దుపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌!

ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్న వేళ జనసేనకు షాక్ తగిలింది. జనసేన గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలన్న RPC పార్టీ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారించనుంది. గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు పిటిషనర్‌. మరిన్ని వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.

New Update
BREAKING: జనసేనకు షాక్‌.. గాజు గ్లాసు గుర్తు రద్దుపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌!

Glass Symbol Fight Between Janasena and Rashtriya Praja Congress: ఎన్నికల వేళ జనసేనకు గట్టి షాక్ తగిలింది. గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో (AP High Court) పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ పిటిషన్‌ను విచారణకు హైకోర్టు అనుమతినిచ్చింది. గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు పిటిషనర్‌. గతేడాది మే 13న గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా ఈసీ ప్రకటించిందని గుర్తు చేశారు. గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాలని ఈసీకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ దరఖాస్తు చేసుకుంది. ఈసీతో (EC) సంప్రదింపులు చేస్తున్న సమయంలో గాజు గ్లాసును జనసేనకు కేటాయించారని పిటిషనర్‌ చెబుతున్నారు. ప్రతివాదులుగా కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సంఘాలు, జనసేన పార్టీని చేర్చారు.

గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన పోటి చేస్తుందా?

రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గత నెల జనవరి 25న ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన పార్టీ (Janasena Party) తరపున పోటీ చేసే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఈసీ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి ఆదేశాలు జారీ చేసింది. గత ఎన్నికల్లో ఏపీలో, తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే (Glass Symbol) పోటీ చేసింది. ఈసారి కూడా, జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేసేలా ఈసీ ఆదేశించింది.

ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పార్టీ కేవలం ఒక అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. మొత్తం 5.53శాతం ఓట్ షేర్‌ను సాధించింది. జనసేన తన గాజు గ్లాసు సింబల్‌ని కాపాడుకోవడానికి తగిన సంఖ్యలో ఓట్లను పొందడంలో విఫలమైంది. అయితే గాజు గ్లాస్‌ను ఉమ్మడి చిహ్నంగా కొనసాగించాలని కోరుతూ పవన్ కల్యాణ్, మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) గతేడాది కాలంగా ECIతో సంప్రదింపులు జరిపారు.

Also Read: విరాళాల మీద జనసేన అధినేత పవన్ కీలక నిర్ణయం

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు