Rohit Sarma: మరోసారి తండ్రి కాబోతున్న హిట్‌మ్యాన్ !

క్రికెటర్‌ రోహిత్‌ శర్మ మరోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్‌ భార్య రితికా బేబీ బంప్ తో కనపడింది. దీంతో సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

author-image
By Bhavana
New Update
Rohit Sarma: మరోసారి తండ్రి కాబోతున్న హిట్‌మ్యాన్ !

Rohit Sarma: ప్రస్తుతం టీమిండియా జట్టుకు క్రికెట్ నుంచి చాలా లాంగ్‌ గ్యాప్‌ దొరికింది. దీంతో ప్రతి ఆటగాడు కూడా ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్నారు. టీ 20 గెలిచిన తరువాత రోహిత్‌ శర్మ టీ 20 ఫార్మాట్‌ కు రిటైర్ మెంట్‌ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఇటీవల జరిగిన శ్రీలంక టూర్లో రోహిత్ శర్మ వన్డేలకు మాత్రమే కెప్టెన్ గా ఉన్నాడు.

తర్వాత బంగ్లాదేశ్ సిరీస్ లో అతడు ఆడతాడు. ప్రస్తుతం లాంగ్ బ్రేక్ దొరకడంతో ఆయన కుటుంబంతో కలిసి వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. ఇదే క్రమంలో తాజాగా రోహిత్ శర్మ తన భార్య రితికతో కలిసి CEAT క్రికెటర్ రేటింగ్ కార్యక్రమానికి విచ్చేశాడు. ప్రస్తుతం ఈవెంట్ సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ ఈవెంట్ లో రోహిత్ శర్మ భార్య రితికను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు.. రితిక మళ్లీ గర్భంతో ఉన్నట్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆమె చిన్నపాటి బేబీ బంప్ తో ఉన్నట్లు ఈ వీడియోలో తెలుస్తుంది అయితే ఈ విషయం గురించి హిట్‌ మ్యాన్‌ నుంచి క్లారిటీ రావాల్సిందే.

ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు.. అతి త్వరలోనే రోహిత్ జోడి జూనియర్ హిట్ మ్యాన్ కు జన్మ ఇవ్వబోతున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. రోహిత్ జంటకు ఇప్పటికే సమైరా అనే పాప ఉంది.

Also Read: నెక్ట్స్‌ కూలేది ఆ హీరో కట్టడమే.. సినీ ఇండస్ట్రీకి హైడ్రా టెన్షన్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment