Rohit Sharma Record: పాకిస్థాన్ పై రోహిత్ శర్మ కొత్త రికార్డ్.. ఏమిటంటే.. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది వేసిన మొదటి ఓవర్ లో సిక్సర్ బాదాడు. ఇప్పటివరకూ షాహీన్ వేసిన తొలి ఓవర్‌లో రోహిత్ మినహా ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ ఈ ఘనత సాధించలేదు. ఈ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. By KVD Varma 10 Jun 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Rohit Sharma Record: న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన T20 ప్రపంచ కప్ 19వ మ్యాచ్ భారత్ - పాకిస్తాన్ మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. అయితే, ఈ మ్యాచ్‌లో వర్షం నీడ ఆవరించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఒక ఓవర్ పూర్తయిన తర్వాత మళ్లీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షానికి.. వర్షానికి మధ్య జరిగిన ఒక్క ఓవర్‌లో టీమిండియా వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్‌లోనే అద్భుతమైన సిక్సర్ కొట్టి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ప్రత్యేక రికార్డు సృష్టించాడు. చరిత్ర సృష్టించిన రోహిత్.. Rohit Sharma Record: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్ బంతులన్నీ ఆడాడు. ఈ ఓవర్‌లో రోహిత్ 8 పరుగులు చేశాడు. ఈ 8 పరుగులలో ఓ భారీ సిక్సర్ ఉంది. ఈ సిక్స్‌తో పాటు రోహిత్ పేరిట ఓ ప్రత్యేక రికార్డు క్రియేట్ అయింది. అదేంటంటే.. వన్డే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో షాహీన్ అఫ్రిదిపై తన తొలి ఓవర్‌లోనే సిక్సర్ బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. షాహీన్ వేసిన తొలి ఓవర్‌లో రోహిత్ మినహా ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ ఈ ఘనత సాధించలేకపోయాడు. A thumping start! 😍 Right before the rain delay, Rohit Sharma took the aerial route to find the first MAXIMUM over the square leg boundary! 👏🏻 Will 🇮🇳 openers continue to dominate with the bat after the play resumes?#INDvPAK | LIVE NOW | #T20WorldCupOnStar pic.twitter.com/5mmyjuLD11 — Star Sports (@StarSportsIndia) June 9, 2024 అనుభవం విఫలం.. Rohit Sharma Record: పాకిస్థాన్‌తో జరిగిన ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో, టీమిండియా అనుభవజ్ఞులైన జోడి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో విఫలమైంది. గత మ్యాచ్‌లో కేవలం 1 పరుగుకే ఇన్నింగ్స్ ముగించిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 13 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇలా టీమిండియా ఆరంభంలోనే అనుభవజ్ఞుల వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. Also Read: పాకిస్థాన్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం పడే సూచన ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ టైమింగ్ కూడా మారింది. మ్యాచ్ 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ 8:50కి ప్రారంభమైంది. దీంతో ఒక ఓవర్ తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. తరువాత మ్యాచ్ తిరిగి ప్రారంభం అయింది. అంతరాయం లేకుండా కొనసాగింది. ఉత్కంఠభరితం.. Rohit Sharma Record: మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి.. 119 పరుగుల తక్కువ స్కోర్ కే పరిమితం అయింది. అయితే, తరువాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేయగా.. అద్భుతమైన ఫీల్డింగ్ భారత్ ను విజయతీరాలకు చేర్చింది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించే దశలో పాకిస్థాన్ ఉండగా, టీమిండియా తర్వాతి రౌండ్ చేరడం దాదాపు ఖాయమైంది. #rohit-sharma #t20-world-cup-2024 #cricket మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి